మైఖేల్ జాక్సన్ చిట్ట చివరి వీడియోను ప్రదర్శించనున్న 'గ్రామీ'...!!

By Kuladeep

ప్రపంచ సంగీత ప్రపంచానికి అత్యుత్తమ పురస్కారం గ్రామీ అవార్డు, పాప్ ప్రపంచంలో అత్యుత్తమంగా నిలిచిన దివంగత మైఖేల్ జాక్సన్ కు ఘన నివాలి అర్పించేందుకు సిద్ధం అవుతోంది. జనవరి 31న జరిగే ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో మైఖేల్ జాక్సన్ చేసిన చిట్టచివరి 3-డి వీడియోను ప్రదర్శించనున్నట్టు వారు ప్రకటించారు. గత సంవత్సరం జులై లో లండన్ లో జరగాల్సిన మైఖేల్ పాప్ షో కోసం ఆయన రూపొందించిన 3-డి వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించాలని వారు నిర్ణయించారు. ఈ వీడియోతో తాను పాప్ ప్రపంచంలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఆయన తీసారు. ఈ 3-డీ వీడియోను జులై లో జరగాల్సిన షో ప్రదర్శించాలనుకున్నారు, కానీ జూన్ 25న మైఖేల్ హఠాన్మరణంతో ఆ షో ఆగిపోయిన సంగతి తెలిసింది.

మైఖేల్ చేసిన ఈ చిట్టచివరి వీడియోలో కొంత భాగాన్ని డాక్యుమెంటరీ చిత్రం 'దిస్ ఈజ్ ఇట్'లో చూపించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో పూర్తివీడియోను చూపించనున్నట్టు గ్రామీ అవార్డు కార్యక్రమ కో-ప్రొడ్యూసర్ కెన్ ఎన్ల్రిచ్ తెలిపారు. ఇదే వేదికపై పాప్ రారాజు మైఖేల్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రధానం చెయ్యనున్నారని విశ్వసనీయ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X