twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదరకొట్టిన పిల్లి: హాలీవుడ్‌ ఛాన్స్

    By Srikanya
    |

    Cat
    లాస్ ఏంజిల్స్ : ఏ పిల్లికిలేని ఎన్నో ప్రత్యేకతలు, కళ్లతోనే పలికించే కోటి భావాలు గ్రంపీ అనే పిల్లికి హాలీవుడ్‌ సినిమాలో హీరోయిన్‌గా మెరిసే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ఎప్పటికప్పుడు గ్రంపీ మార్చే హావభావాలను కెమేరా ద్వారా ఒడిసిపట్టి వెండి తెరపై ఆవిష్కరించాలని అనుకుంటోంది ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ.

    'పాల్‌ బ్లర్ట్‌ మాల్‌ కాప్‌', 'ఆడమ్‌ శాండ్‌లర్‌', 'జాక్‌ అండ్‌ జిల్‌' వంటి హాస్యభరిత చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఈ నిర్మాణ సంస్థది. గ్రంపీ హావభావాలకు అనుగుణంగా ఒక పంక్తిలో రాసే పదాలు నేటి సామాజిక పరిస్థితులపై సంధించిన బాణాలే ఇతివృత్తంగా ఉంటుందట ఈ చిత్రం.

    వివరాల్లోకి వెళితే.... వింత చేష్టలతో, విచిత్రమైన ఆకారంతో అందరినీ ఆకట్టుకుందో పిల్లి. అతి తక్కువ కాలంలో అందరి దృష్టి ఆకర్షించింది గ్రంపీ అనే పిల్లి. ఆరిజోనాలో నివసించే తబాథా బుండిసేన్‌ పెంపుడు పిల్లే ఇది.

    ఇప్పుడు అందరూ ప్రేమగా పిలిచే ఈ గ్రంపీ అసలు పేరు 'తర్‌దార్‌ సాస్‌'. ముద్దుగా తబాథా 'తర్ద్‌' అని పిలుస్తుంది దీన్ని. ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది కాబట్టి దీన్ని గ్రంపీ అని కూడా అంటారు. ఈ పిల్లికి పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపం వల్ల మిగతా పిల్లులకంటే దీని మూతి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ లోపమే దీన్ని సెలబ్రిటీని చేసింది.

    ఎప్పుడూ ముఖాన్ని ముటముటలాడిస్తూ గ్రంపీ వ్యక్తపరిచే హావభావాలను తబాథా సోదరుడైన బ్రియాన్‌ బుండిసన్‌ తన కెమేరాలో బంధించిన ఫొటోలను 'రీడిట్‌' అనే అంతర్జాల వార్త సంస్థ వెలుగులోకి తెచ్చింది. అంతర్జాలంలో సామాజిక, వినోదాత్మక కార్యక్రమాలకు వేదిక ఈ వెబ్‌సైట్‌. గ్రంపీ ఫొటోతో పాటు ఒక పంక్తిలో రాసిన హాస్యభరితమైన వ్యాఖ్యలు దానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

    దీని ఫొటోతో ఉన్న టీ షర్టులు, మగ్గులు, క్యాలెండర్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయి యజమానురాలికి కనకవర్షం కురిపించాయి. పలు వ్యాపార సంస్థలు తమ ప్రకటనల్లో దీని ఫొటోలు ఉపయోగించుకుని లాభపడ్డాయి. తబాథా, ఆమె సోదరుడు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి గ్రంపీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూడటంలో మునిగిపోయారు.

    ఇక పిల్లులే ముఖ్య భూమికగా ఇప్పటి వరకు వచ్చిన గార్‌ఫిల్డ్‌, పుస్‌ ఇన్‌ బూట్స్‌(ష్రిక్‌)లు కార్టూన్‌ పాత్రలు కావడం గమనించదగ్గ విషయం. అయినా ఇవి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాయి.

    English summary
    Hollywood is reporting that Grumpy Cat’s manager Ben Lashes and her rep Al Hassas have cut a movie deal with Todd Garner and Sean Robins of Broken Road Productions “to produce and assemble a package for a Garfield-like feature film with the famous frowning feline at the center.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X