Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రగ్స్ వివాదంలో ఒక సంవత్సరం జైలు శిక్ష నుంచి తప్పించుకున్న హీరోయిన్..!
ఇటీవల కాలంలో హాలీవుడ్ లో ఎక్కువమంది డ్రగ్స్ మాయలో పడ్డారు. అలాంటి వాళ్శలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది లిండ్సే లోహాన్ మరియు పారిస్ హిల్టన్. పారిస్ హిల్టన్ ప్రముఖ హాటల్ వ్యాపారవేత్త మనుమరాలు. ఈమెను పోయిన నెలలో లాస్ వేగాస్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఈమె వెళ్తున్న కారుని ఆపి సోదాచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ కు 0.8గ్రాముల కోకైన్ ఈమె పర్సు లో దోరికిన విషయం మన అందిరికి తెలిసిందే. దీనికి గాను యుఎస్ జడ్జి ఈమెకు 2000డాలర్లు ఫైన్ తో పాటు 200 గంటలు కమ్యూనిటి సర్వీస్ చేయాల్సిందిగా శిక్ష విధించారు. పారిస్ హిల్టన్ స్వస్దలం న్యూయార్క్. పారిస్ హిల్టన్ ను లాస్ వేగాస్ లో అరెస్టు చెయ్యడం జరిగింది కాబట్టి సంవత్సరం పాటు ఇక్కడే జైలు శిక్ష అనుభవించాల్సిందేనని జడ్డి గారు తీర్పుని ఇవ్వడం జరిగింది.
ఈ విషయంలో పారిస్ హిల్టన్ కు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అందులో సంవత్సరం పాటు మంచి సత్పర్తన కలిగేవరకు లాస్ వాగాస్ లో ఒక సంవత్సరం పాటు వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. దీనితో పారిస్ హిల్టన్ లాయర్ డేవిడ్ చేసన్ఆఫ్ మాట్లాడుతూ ఆమెకు ప్రస్తుతం ట్రీట్ మెంట్ అవసరం కాబట్టి, రిహాబ్ కు తరలించవలసిందగా కోరాడు. ఆయన కోరికను మన్నించినటువంటి కోర్టు ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష తగ్గించినట్లు ఇటీవల వివరించారు. అంతేకాకుండా ఆమెను ఒక ఫేషంట్ మాదిరి ట్రీట్ చెయ్యాలని ఆమె త్వరగా కోలుకోవడానికి మీ వంతు సహాకారాన్నికూడా అందివ్వాలని ఆయన కోర్టుని కోరడం జరిగింది.