ఆమెను నేనింకా ప్రేమిస్తున్నానంటున్న మాజీ భర్త
హాలీవుడ్ పాప్ రారాణి మడోన్నాను తానింకా ప్రేమిస్తూనే ఉన్నానని ఆమె మాజీ భర్త గైరిచీ ప్రముఖ పత్రిక ఎస్క్వేర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 41 ఏళ్ల ఈ బ్రిటిష్ డైరక్టర్ గైరిచీ తన భార్య మడోన్నాతో ఉన్న వివాహ బంధాన్ని గత ఏడాది విడాకులతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.మడోన్నా కెరీర్ కోసం ఎంతో శ్రమపడ్డానని గైరిచీ చెప్పారు. ఇప్పటికీ..ఎప్పటికీ మడోన్నాను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ మడోన్నాకే తనపై ప్రేమ మందగించిందని గైరిచీ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు.
ఇదిలావుంటే.. గత ఏడాది నవంబరులో గైరిచీ-మడోన్నాలు తమ ఎనిమిదేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెగతెంపులు చేసుకున్నారు. వీరిద్దరికి తొమ్మిదేళ్ళ కుమారుడుతో పాటు మలావి నుంచి దత్తత తీసుకున్న మరో పుత్రుడు కూడా ఉన్నారు. తాజాగా "షెర్లాక్ హోమ్స్" అనే చిత్రానికి గైరిచీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎస్క్వేర్ మ్యాగజైన్‌తో గైరిచీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











