సముద్రాన్ని ఈదవచ్చుకానీ సంసారాన్నీ ఈదలేం అంటున్న హీరోయిన్
ఐరన్ మ్యాన్ సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అందరికి సుపరిచితమయ్యారు మన జేనిత్ పాల్ట్రో. జేనిత్ పాల్ట్రో 2003లో కోల్డ్ ప్లే ప్రంట్ మ్యాన్ అయినటువంటి క్రిస్ మార్టిన్‌ను ప్రేమించి పెళ్శి చేసుకోవడం జరిగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుకు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. ఒకరి పేరు ఆపిల్ కాగా మరొకరు పేరు మోసెస్. ఇలా సుఖంగా సాగిపోతున్న తన జీవితం గురించి ఇటీవల ఓ గుడ్ హౌస్ కీపింగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జేనిత్ పాల్ట్రో మాట్లాడుతూ కుటుంబ జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుందని వివరించారు.
పెళ్శి అనేది చాలా కష్టం. మాకుటుంబ జీవితంలో కూడా క్రిస్, నేను చాలా ఎత్తుపల్లాలను చూడడం జరిగింది. ఐతే నాకు క్రిస్‌కి మద్య ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినప్పటికీ కుడా ఇద్దరం సర్దుకుపోయే మనసుతత్వంతో కలసి మెలసి ఇన్ని సంవత్సరాలు జీవించాం అని అన్నారు. అంతేకాకుండా మాజీవితాలలో వచ్చిన అన్ని అడ్డంకులను మేము నవ్వుతూ, ఆనందంగా అధిగమించడం జరిగిందన్నారు.
ఇకపోతే ప్రస్తుతానికి జేనిత్ పాల్ట్రో ఇటీవల కాలంలో ఓ మ్యూజికల్ కామెడీ డ్రామా 'గ్లీ' లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ మ్యూజికల్ కామెడీ డ్రామాలో విల్ తో డేట్ చేసేటటువంటి క్యారెక్టర్ లో జేనిత్ పాల్ట్రో కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో టీచర్ కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో రెండు ఎపిసోడ్స్ లో మాత్రమే పాల్గోంటారు.


Click it and Unblock the Notifications











