Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెక్స్‌కు బానిసలైన వారికి ఇచ్చే ట్రీట్మెంటే ఈ సినిమా
ఐరన్ మ్యాన్ సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అందరికి సుపరిచితమయ్యారు మన జేనిత్ పాల్ట్రో. జేనిత్ పాల్ట్రో 2003లో కోల్డ్ ప్లే ప్రంట్ మ్యాన్ అయినటువంటి క్రిస్ మార్టిన్‌ను ప్రేమించి పెళ్శి చేసుకోవడం జరిగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుకు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. ఒకరి పేరు ఆపిల్ కాగా మరొకరు పేరు మోసెస్. ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ అయిన జేనిత్ పాల్ట్రో నటించిన చిత్రం 'ధ్యాంక్స్ ఫర్ షేరింగ్'లో రెచ్చిపోయిన మరీ అందాలను చూపించారని సమాచారం.
వివరాల్లోకి వెళితే 'ధ్యాంక్స్ ఫర్ షేరింగ్' అనే సినిమాలో జేనిత్ పాల్ట్రో సెక్సు కోసం పరితపించే వ్యక్తిగా నటించడం జరిగింది. తన కొస్టార్ 'మార్క్ రఫ్పెలో' తో ప్రముఖ వీడియో ఛాటింగ్ వెబ్సైట్ స్కైపీ ద్వారా 'స్ట్రిప్ టీజ్' డాన్స్ చేయడం జరిగింది. స్ట్రిప్ టీజ్ డాన్స్ గురించి చెప్పాలంటే ఈ డాన్స్‌ని సాధారణంగా సొసైటీలో ఉన్న హై ఫ్యాషన్ క్లబ్స్లలో మాత్రమే అందుబాటులో ఉంది. క్లబ్స్‌కి వచ్చేటటువంటి కస్టమర్స్ ముందు డాన్స్ చేస్తూ ఒంటి మీద ఉన్న బట్టలను ఒకదాని తర్వాత ఒకటి తీసివేస్తూ ఉండడమే.
జేనిత్ పాల్ట్రోకి సంబంధించిన కొన్ని అందమైన శృంగార సీన్లుని 24వ వీధిలో ఉన్న 'క్యారేజి హౌస్' లో బుధవారం, గురువారం, శుక్రవారం తీయనున్నారు. ఈ సినిమాలో జేనిత్ పాల్ట్రోని అందంగా చూపించడమే కాకుండా, ఆమె అందాలను కూడా అభిమానులకు చూపించే విధంగా దర్శకుడు ప్లాన్ చేశాడని హాలీవుడ్ కొడై కూస్తుంది. సెక్సుకు బానిసలైన ముగ్గురు మనుషులకు 12 పద్దతుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని ఈ సినిమాలో ప్రముఖంగా చూపించనున్నారు.