»   » సెక్స్ ఆలోచనలు, హీరోయిన్ ముద్దులు (ఫోటోలు)

సెక్స్ ఆలోచనలు, హీరోయిన్ ముద్దులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఐరన్ మ్యాన్ సిరీస్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన జేనిత్ పాల్ట్రో తన తర్వాతి సినిమా 'థాంక్స్ ఫర్ షేరింగ్' చిత్రంలో తన అందాల విశ్వరూపం చూపించడంతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు కిక్కెక్కించేందుకు సన్నద్ధం అవుతోంది. 40 ఏళ్ల జేనిత్ పాల్ట్రో ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్లో తన లోదుస్తులు విప్పుతూ సెక్సీగా దర్శనం ఇచ్చింది. కామెడీ అండ్ సెక్స్ మూవీగా 'థాంక్స్ ఫర్ షేరింగ్' చిత్రం రూపొందుతోంది.

'సాధారణంగా ఒక మనిషి సగటున రోజుకు 15 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తాడు. కానీ కొందరు గంటకు 15 సార్లు ఆలోచిస్తారు' అనే కాన్పెప్టుతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. సెక్స్‌కు అడిక్ట్ అయిన వ్యక్తుల నేపథ్యంతో సాగే కామెడీ సినిమా ఇది.

సెక్స్‌కు అడిక్ట్ అయి 12 స్టెప్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈచిత్రంలో జేనిత్ పాల్ట్రో ఫోబె పాత్రలో నటిస్తోంది. సెక్స్‌కు అడిక్ట్ అయిన ఆడమ్(మార్క్ రఫాలో) ప్రేమలో పడే పాత్రలో పోషిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో ఓ సీన్లో...పార్కులో జేనిత్ పాల్ట్రో మార్క్ రఫాలో మధ్య గాఢమైన ముద్దు సీన్ ఉంది. మరో సీన్లో జేనిత్ పాల్ట్రో తన లోదుస్తులు విప్పుతూ కనిపించింది. ఈ రెండు సీన్లు శృంగార ప్రియుల్లో సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

జేనిత్ పాల్ట్రో గతంలో నటించిన సినిమాలకు, తాజాగా చేస్తున్న ‘థాంక్స్ ఫర్ షేరింగ్' సినిమాకు చాలా తేడా ఉంది. ఈసినిమా మొత్తం సెక్స్ ఆలోచనల చుట్టే తిరుగుతుంది.

గతంలో ఏ చిత్రంలోనూ లేని విధంగా జేనిత్ పాల్ట్రో ఈ చిత్రంలో బెడ్రూం సీన్లలో రెచ్చిపోయి నటించినట్లు స్పష్టమవుతోంది.


పార్కులో జేనిత్ పాల్ట్రో మార్క్ రఫాలో మధ్య గాఢమైన ముద్దు సీన్

ఈ మధ్య సమాజంలో సెక్స్ కు అడిక్ట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మితిమీరిన సెక్స్ యావ నుంచి బయటపడేందుకు పలు ట్రీట్ మెంట్ కేంద్రాలు కూడా వెలిసాయి. ఆ నేపథ్యాన్ని తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు.


ఈచిత్రంలో జేనిత్ పాల్ట్రో ఫోబె పాత్రలో నటిస్తోంది. సెక్స్‌కు అడిక్ట్ అయిన ఆడమ్(మార్క్ రఫాలో) ప్రేమలో పడే పాత్రలో పోషిస్తోంది.

యూఎస్ పాప్ స్టార్ పింక్....తొలిసారిగా ‘థాంక్స్ ఫర్ షేరింగ్' సినిమాలో మేజర్ రోల్ పోషిస్తోంది. ఈమె ఇందులో 12 స్టెప్ రికవరీ ప్రోగ్రామ్ లో ఏకైక ఫిమేల్ మెంబర్‌గా నటిస్తోంది.

థాంక్స్ ఫర్ షేరింగ్... చిత్రం ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వీరంతా సెక్స్ కు అడిక్ట్ అయినవారు. 12 స్టెప్ రికవరీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారు. మార్క్ రఫాలో, టిమ్ రాబిన్స్, జోలీ రిచర్డ్సన్ ఇందులో నటిస్తున్నారు.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత చిత్రాల కంటే ఇందులో జేనిత్ పాల్ట్రో ఎంతో బాగా నటించిందట.

English summary
Actress Gwyneth Paltrow, who is known for her role Pepper Potts in the Iron Man movies, is turning a seductress in her next movie Thanks For Sharing, which is directed by Stuart Blumberg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu