twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన హ్యాకర్ క్షమాపణ

    By Nageswara Rao
    |

    ఇటీవల కాలంలో ఓ హ్యాకర్ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్‌కి సంబంధించిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి ఆమెని అల్లరి పాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని అమెరికన్ ఎఫ్‌బిఐలో రిపోర్ట్ చేయడంతో ఈ కేసుని వారు డీల్ చేయడం తెలిసిందే. ఇంకేమంది ఎఫ్‌బిఐ రంగంలోకి దిగిన తర్వాత ఎంతటి దొంగ అయినా దొరకాల్సిందే. ఇక్కడ కూడా అదే జరిగింది.

    బుధవారం 35 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టోఫర్ ఛాన్సీ అనే యువకుడిని ఎఫ్‌బిఐ అరెస్టు చేయడం జరిగింది. ఇతనిపై ఉన్న చేయబడ్డ ఆరోపణలు స్కేర్ లెట్ జాన్సన్‌తో పాటు, ప్రముఖ సెలబ్రిటీలకు మిలా కునిస్, జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్‌కు చెందిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం జరిగింది. పోలీసులకు దొరికిపోయిన తర్వాత క్రిస్టోఫర్ ఛాన్సీ వారి సమక్షంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్దం అయింది. నా ద్వారా బాధింప బడ్డ వారికందరికి నేను క్షమాపణలను తెలియజేస్తున్నానని అన్నారు.

    ఇక గతంలో స్కేర్ లెట్ జాన్సన్‌కి చెందిన నగ్న చిత్రాలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో లభించడంతో అభిమానులు కంగుతిన్నారు. ఇంటర్నెట్లో ఉన్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలను చూసినట్లేతే మొదటి ఫోటోలో స్కేర్ లెట్ జాన్సన్ యొక్క స్దనములు కనిపించేటట్లు టాప్ లెస్ ఫోజుతో ఉండగా, రెండవ ఫోటోలో ఒంటిమీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా కిచెన్లో తనయొక్క వెనుక భాగాన్ని చూపిస్తున్నటువంటి ఫోటో. ఈ ఫోటోలను ప్రముఖ గాసిప్ సైట్స్, మెసేజ్ బోర్డ్స్ తమతమ వెబ్ సైట్స్‌లలో ఉంచిన వెంటనే వాటిని తీసివేయడం జరిగింది.

    గతంలో జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్‌కి సంబంధించిన ప్రయివేట్ పోటోలను కూడా ఈ హ్యాకరే ఇంటర్నెట్లో లీక్ చేసి ఉంటాడని ఎఫ్‌బిఐ భావిస్తుంది. ఐతే ఈ విషయంపై స్కేర్ లెట్ జాన్సన్‌ ఇంతవరకు ప్రస్తావించక పోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి విషయాలు పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడే విషయాలు కాకపోబట్టే స్కేర్ లెట్ జాన్సన్‌ సైలెంట్‌గా ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు. స్కేర్ లెట్ జాన్సన్ తన భర్త రేయన్ రేనాల్డ్స్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

    English summary
    The hacker who stole naked pictures of actress Scarlett Johansson has apologised.Christopher Chaney, 35, who was arrested Wednesday, admitted to stealing pictures from Johansson and other celebrities, including Mila Kunis and Vanessa Hudgens, and posting them on the internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X