ఆ నటి జీవితంలోని చీకటికోణాలు...!!
హాలీవుడ్ నల్ల కలువ, ఆస్కార్ అవార్డు విజేత హల్లే బెర్రీ, బాండ్ గర్ల్ గా కూడా సుపరిచయమే. కాగా ఇటీవల ఆమెకు హాలీవుడ్ రిపోర్టర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఉగ్వేగపూరిత ప్రసంగం ఇచ్చారు. తన చిన్న తనంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని తనీ స్థాయికి వస్తానని అనుకోలేదని, ఈ స్థాయికి వచ్చానంటే అందుకు తన ఉపాధ్యాయురాలే కారణమని చెప్పుకొచ్చారు.
తన చిన్నతనంలో తానెన్నో బాధలు పడ్డానని, తన తండ్రి పచ్చి తాగుబోతని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తాగి రావడమే కాకుండా తనని, తన తల్లిని ఎంతో బాధించే వాడని, చిత్రహింసలకు గురిచేసేవాడని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి తనకు తనెళ్తున్న పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఎంతో తోర్పాటునందించిందని, తనేదో ఓ రోజు గొప్పదాన్ని అవుతానని ఆమె భావించే వారని, ఆమె తోర్పాటే లేకపోతే ఈ హల్లే బెర్రీ మీ ముందుకొచ్చి మాట్లాడగలిగేదు కాదని, ఈ సంజర్భంగా తన ఉపాధ్యాయురాలుకి ధన్యవాదాలు చెప్పుకుంది.
హాలీవుడ్ లో కూడా తాను నల్లజాతీయురాలిని అయినందున తొలుత ఎన్నో అవమానాలు భరించాల్సివచ్చిందని, కానీ ఆ తర్వాత తను ఎదిగే కొద్దీ అందరూ గౌరవించడం ప్రారంభించారని, ఆస్కార్ అవార్డు వచ్చిన క్షణాలు నేను జీవితంలో మరువలేనని ఆమె తెలియజేసింది.


Click it and Unblock the Notifications











