ఆ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు బ్రేక్ వేసిన హీరో...!!
హాలీవుడ్ సూపర్ హీరో విల్ స్మిత్ నటించిన కామెడీ, యాక్షన్ సినిమా హ్యాంకాక్. 2008వ సంవత్సరంలో విడుదలయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని దర్శకనిర్మాతలు అప్పుడే నిర్ణయించారు. త్వరలోనే ఈ సీక్వెల్ ను తెర మీదకు తీసుకు రావాలని దర్శకుడు పీటర్ బర్గ్ అనుకున్నాడట. కానీ తాజా ఇప్పుడీ ప్రయత్నాలకు ఈ సినిమా హీరో విల్ స్మిత్ కు ఉండే ఆనవాయితీ అడ్డుపడి సినిమాను వాయిదా వేసేలా చేసిందట.
ఇంతకీ ఈ సినిమాకు అడ్డుపడిన విషయం ఏంటీ అనుకుంటున్నారా?? ఏమీ లేదు విల్ స్మిత్ కు ఓ సినిమా పూర్తి కాగానే తన కుటుంబసభ్యలతో కలసి కొన్నాళ్లు గడపడం అలవాటు అట. ప్రొఫెషనల్ లైఫ్ లో పడి వ్యక్తిగత జీవితాన్ని చేజార్చుకోవడం తనకు ఇష్టం వుండదని, అందుకే ప్రతి సినిమా అనంతరం కొంత సమయం తన కుటుంబ సభ్యలతో గడపడం తను ఆనవాయితీగా పెట్టుకున్నట్టు తెలిపాడు. ఇక చేసేదేమీ లేక దర్శకుడు కూడా విల్ స్మిత్ సినిమాకు రెఢీ అయ్యేవరకూ వేచిచూద్దాం అనే ధోరనిలో వున్నట్టు తెలిసింది. కాగా ఈ సినిమాలో విల్ స్మిత్ తో పాటు, హ్యాంకాక్ లో నటించిన ఛార్లెజ్ థెరాన్ కూడా నటిస్తున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











