twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారితో డేటింగ్ రూమర్స్ అంతా అబద్దం

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ గాయని, సంగీత సంచలనం టేలర్ షిఫ్ట్‌పై రోజుకో రూమర్ వస్తుంది. ఈ రూమర్స్ ఎలా ఉన్నాయంటే టేలర్ షిఫ్ట్ తన జీవితంలో ఒక్కసారిగా కలవని వ్యక్తులతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌ని టేలర్ షిఫ్ట్ ఖండించారు. ఇక వివరాల్లోకి వెళితే 22 సంవత్సరాల వయసు కలిగిన టేలర్ షిఫ్ట్ ఇంత వరకు తన జీవితంలో కలుసుకోని నటులు జాక్ ఎఫ్రాన్ మరియు ఎడ్డీ రెడ్ మాన్యేలతో కలసి డేటింగ్ చేస్తుందంటూ వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.

    ఈ సందర్బంలో టేలర్ షిఫ్ట్‌ మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ అన్ని వినేందుకు నాకు చాలా ఫన్నీగా ఉన్నాయని అన్నారు. డేటింగ్‌లో మీరు చెప్పిన వారితో నేనింత వరకు కలవనే కలవలేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గా జీవిస్తున్నప్పటికీ.. చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. గతంలో ఇలానే టేలర్ స్విఫ్ట్, నటుడు టేలర్ లూట్నర్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని హాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండించారు. ఐతే 'వాలెంటైన్స్ డే' సినిమా కోసం టేలర్ షిఫ్ట్‌ లూట్నర్ కోసం ఓ పాటను కూడా రాసింది. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలకు బలం చేకూరింది.

    English summary
    Singer Taylor Swift is amused at hearing rumors about her dating people she hasn’t even met.The 22-year-old was recently linked to actor Zac Efron and Eddie Redmayne.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X