పోల్ డ్యాన్సింగ్ నేర్చుకుంటుంటే భలే మజా: ఎమ్మా వాట్సన్
హ్యారీ పొట్టర్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ తన స్నేహితురాలి సలహా కోరిక మేరకు పోల్ డ్యాన్సింగ్ నేర్చుకుంటున్నారు. ఈ విషయంపై ఎమ్మా వాట్సన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ చాలా సినిమాలలో ఫిల్మ్ సెట్స్ లలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది.
ఒకానొక సినిమా షూటింగ్‌లో తన స్నేహితురాలు నాకు పోల్ డ్యాన్సింగ్ ఆట అంటే చాలా ఇష్టం అని వాట్సన్ తో ప్రస్తావించడమే కాకుండా.... ఈ ఆటను నేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారని తెలుపుగా.. ఈ సలహాని స్వీకరించిన ఎమ్మా వాట్సన్ పోల్ డ్యాన్సింగ్ నేర్చుకోవడం వల్ల తన శరీరం అందమైన షేప్‌ని సొంతం చేసుకుందని తెలిపాడు.
పోల్ డ్యాన్సింగ్ ఆట ఆమెను ఆనందించగలిగినదని... అలాంటి సందర్బంలో పోల్ డ్యాన్సింగ్ నేర్చుకోవాలనే ఆలోచన రావడం చాలా స్వేచ్ఛనిచ్చిందని తెలుసుకుంది. గతయేడాది వేసవిలో న్యూ యార్క్ లో "హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్: పార్ట్ 2" ప్రీమియర్ తరువాత ఆమె స్నేహితులతో కలిసి పోల్-డ్యాన్స్ క్లబ్ వద్ద పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











