ఈ దశాబ్దపు అత్యుత్తమ ఎంటర్టెయినర్ గా హ్యారీ పోటర్..!!
ప్రజలను ఎంటర్టెయిన్ చెయ్యడానికి ఎన్నో అంశాలు వున్నాయి. రకరకాల టెలివిజన్ షోలు, సినిమాలు, పాటలు వీటికి తోడు యూ-ట్యూబ్, ఫేస్ బుక్ వంటి ఆన్ లైన్ ఎంటర్టెయినర్స్. కానీ వీటన్నిటినీ తలదన్ని జెకె రోలింగ్ రాసిన నవల హ్యారీ పోటర్ తొలిస్థానంలో నిలిచింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ ఎంటర్టెయినర్ ఏది అని అమెరికన్ మ్యాగ్జయిన్ ఎంటర్టెయిన్మెంట్స్ నిర్వహించిన సర్వేలో చాలా మంది హ్యారీ పోటర్ అని ముక్తకంఠం తో వెళ్లడించారు. హ్యారీ పోటర్ నవల కానీ, అతడి సాహసాలను తెరపై చూడడం కానీ తమకెంతో ఆనందాన్నిచ్చిందని వారు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాతి స్థానంలో సోప్రానస్ టివీ సీరీస్ నిలిచింది. ఇక మూడవ స్థానంలో యూ-ట్యూబ్, ఆ తర్వాతి స్థానంలో ది లార్డ్ ఆఫ్ ది రంగ్స్ సినిమా నిలిచింది. సూపర్ హిట్ అయిన రికీ గర్వెయిస్ సీరియల్ ఈ లిస్ట్ లో 28వ స్థానంలో నిలవడం గమనార్హం.
హ్యారీ పోటర్ జెకె రోలింగ్ హాలీవుడ్ యూ-ట్యూబ్ ఫేస్ బుక్ harry potter jk rowling hollywood you tube face book ricky gervais


Click it and Unblock the Notifications