పీకలదాకా తాగి స్క్రిప్టు పోగొట్టుకున్న ఘనులు
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పుస్తకం హ్యారీ పోటర్. ఈ పుస్తకం ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం హ్యారీ పోటర్ కూడా బహుళజనాదరణ పొందింది. ఈ సీరీస్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. మరో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలాంటి సినిమాల్లో చివరి సినిమాగా రాబోతున్న హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హ్యాలోస్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఓ అభిమానికి ఏకంగా ఈ సినిమా స్క్రిప్టే దొరికింది. సరదాగా మందు కొడదామని పబ్ కు వెళ్లిన ఆయనకు టేబుల్ కింద ప్రయివేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని రాసున్ని ఓ రికార్డు దొరికింది. ఏంటా అని చదివిచూసిన ఆయనకు హ్యారీ పోటర్ చివరి సినిమాలో పుస్తకానికి.. సినిమాకు చేసిన మార్పులను రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టు అని అర్థం అయింది. దీంతో ఆయన సినిమా నిర్మాతలు వార్నర్ బ్రదర్స్ కు ఈ స్క్రిప్టును అందజేసాడట.
కానీ ఈ స్క్రిప్టును తాను చదివానని ఎంతో ఆశక్తికరంగా వుందని...ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఎదురుచూస్తున్నానని చెప్పిన ఆయన ఈ స్క్రిప్టు వివరాలు వెళ్లడించేందుకు నిరాకరిస్తున్నాడు. ఇందుకు గాని వార్నర్ బ్రదర్స్ దగ్గర ఈయన పెద్ద మొత్తంలో నజరానా అందుకున్నాడని కూడా సమాచారం. ఇక అంతకు ముందు రోజే సినిమా షూటింగ్ అనంతరం పబ్ కు వెళ్లి పీకల దాకా మందుకొట్టిన సినిమా సిబ్బందే ఈ స్క్రిప్టును అక్కడ వదిలేసి వచ్చినట్టు ప్రాథమిక సమాచారంలో వెళ్లడయింది.


Click it and Unblock the Notifications











