ప్రేమలో పడ్డ హ్యారీ పోటర్ ప్రేయసి బోన్నీ రైట్
ప్రముఖ రచయిత జెకె రోలింగ్ రాసిన హ్యారీ పోటర్ నవల ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ నవల ఆధారంగా 'హ్యారీ పోటర్' సినిమాలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో ముఖ్య భూమికను పోషించిన బోన్నీ రైట్ ప్రేమలో పడిందట. 'హ్యారీ పోటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్' చిత్రంలో హ్యారీ ప్రేయసిగా నటించిన ఈమె, 'హ్యారీ పోటర్ అండ్ డెత్ హ్యాలోస్' సినిమాలో గెల్లర్ట్ గ్రిండెల్ పాత్ర పోషించిన జమైయ్ క్యాంబెల్ లో డేటింగ్ చేస్తోందనే వార్తలు హాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.
దీనికి బలం చేకూరేలా వారు కూడా కలసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట ఈ 18 ఏళ్ల రైట్ మరియు 20 ఏళ్ల క్యాంబెల్. ఇటీవలే లండన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ఇద్దరూ కలసి వెళ్లారట. అక్కడున్న వారంతా వీరిని చూసి ఖచ్చితంగా ప్రేమలో పడ్డారని అనుకున్నారట. ఈ వార్తలను ఇద్దరూ ఖండించకపోవడం కొసమెరుపు.
హ్యారీ పోటర్ జెకె రోలింగ్ బోన్నీ రైట్ హ్యారీ పోటర్ అండ్ డెత్ హ్యాలోస్ హాలీవుడ్ జమైయ్ క్యాంబెల్ harry potter bonnie wright jamie campbell bower jk rowling


Click it and Unblock the Notifications