చివరి అంకానికి చేరిన 'హ్యారీ పోటర్'..!!
జెక్ రోలింగ్ రాసిన హ్యారీ పోటర్ నవల ఎంత ఆదరణ పొందిందో, ఈ నవల ఆధారంగా చేసుకొని రూపొందించిన హ్యారీ పోటర్ సినిమా కూడా అంతే ఆదరణ పొందింది. కాగా ఇప్పుడు ఈ సినిమా చివరి అంకానికి చేరుకొంది. హ్యారీ పోటర్ నవలలో చివరి పుస్తకం 'హ్యారీ పోటర్ అండ్ ది డెల్తీ హ్యాలోస్' ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న సినిమా హ్యారీ పోటర్ అండ్ ది డెల్తీ హ్యాలోస్ పార్ట్-1 కు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చివరి పుస్తకాన్ని రెండు భాగాలుగా విడగొట్టి హ్యారీ పోటర్ అండ్ ది డెల్తీ హ్యాలోస్ పార్ట్-1, హ్యారీ పోటర్ అండ్ ది డెల్తీ హ్యాలోస్ పార్ట్-2 గా తీయనున్నారు. ఇందులోని మొదటి భాగం ఈ ఏడాది నవంబరు 19న థియేటర్లను తాకనుంది.
కాగా ఈ సినిమా కు సంబంధించిన తొలి ట్రెయిలర్ ఇటీవలే విడుదలయింది. ఈ ట్రెయిలర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రెయిలర్లు సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా తప్పక హాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఆశిద్దాం...


Click it and Unblock the Notifications











