‘హ్యారీ పొట్టర్’ సినిమాల విలన్ మృతి, దిక్కులేకుండా...!
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించి వేలాది కోట్ల రూపాలు వసూలు చేసింది 'హారీ పొట్టర్' సీరిస్ సినిమాల్లో విలన్‌గా నటించిన డేవ్ లెగెనో మరణించారు. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో సాహసయాత్ర చేస్తూ లెగెనో మృతి చెందాడు. లెగెనో ఒంటరిగా ఈ సాహస యాత్రకు బయల్దేరారు. దీంతో ఆయన మణించిన విషయం నాలుగైదు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.
డెత్ వ్యాలీలో సాహస యాత్ర చేస్తున్న మరో ఇద్దరికి దారిలో డేవ్ లెగెనో మృతదేహం కనిపించింది. జులై 6వ తేదీన అతని మృత దేహాన్ని కనిపెట్టారు. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో అత్యంత తీవ్రమైన ఉష్టోగ్రతలు ఉంటాయి. ఇక్కడ సాహస యాత్ర చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే.

డెత్ వ్యాలీ అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో డేవ్ లెగెనో మృత దేహాన్ని తరలించడానికి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. చివరకు కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ హెలికాప్టర్ తెప్పించి అతని మృత దేహాన్ని అక్కడి నుండి తరలించారు. 50 ఏళ్ల డేవ్ గెండె సంబంధమైన వ్యాధితో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మృతదేహం కనుగొనడానికి నాలుగు ఐదు రోజుల ముందే అతడు మరణించి ఉంటాడని భావిస్తున్నారు.
బ్రిటిష్ యాక్టర్ అయిన డేవ్ లెగెనో 2000 సంవత్సరంలో 'స్నాచ్' అనే చిత్రంతో కెరీర్ మొదలు పెట్టాడు. బ్యాట్ మ్యాన్ బిగిన్స్, స్టార్మ్ బ్రేకర్, ఔట్ లా, రైస్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్, ఎలిజబెత్:ది గోల్డెన్ ఏజ్ చిత్రాల్లో నటించాడు. హ్యారీ పొట్టర్ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాల్లో డేవ్ నటించాడు.


Click it and Unblock the Notifications











