‘ఆ నిర్మాత ఆరోగ్యపరిస్థితి దారుణం.. చూపు పోయింది.. రిలీజ్ చేయకపోతే జైల్లో మరణిస్తాడు’

పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు, మహిళలపై లైంగిక దాడి ఆరోపణల్లో జైలుశిక్ష్ అనుభవిస్తున్న నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ఆయన జైల్లో ఉంటే మరణించడం ఖాయమనే ఆందోళనను ఆయన తరపు న్యాయవాది వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఆయనను గురించి కోర్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హార్వే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే...

హార్వే‌కు 23 ఏళ్ల జైలుశిక్ష

హార్వే‌కు 23 ఏళ్ల జైలుశిక్ష

హార్వే‌పై రేప్, క్రిమినల్ సెక్స్ యాక్ట్, లైంగిక వేధింపులు, లైంగికంగా దుష్ప్రవర్తన లాంటి పలువురి ఆరోపణలపై 2017లో పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో హార్వేకు 23 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటూ వస్తున్నారు.

కరోనావైరస్ బారిన పడి

కరోనావైరస్ బారిన పడి

ప్రపంచాన్ని కరోనావైరస్ పట్టి పీడిస్తున్న మార్చి నెలలో హార్వే జైలులో కోవిడ్19 బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నది. ఆయనను అలాగే వదిలేస్తే జైల్లోనే మరణించడం ఖాయం. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వండి అంటూ హార్వే లాయర్ కోర్టును వేడుకొన్నారు.

జైల్లో హార్వే అంధుడిగా మారిపోయారు

జైల్లో హార్వే అంధుడిగా మారిపోయారు

హార్వే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వాదన జరిగింది. ఈ సందర్భంగా అనారోగ్య కారణాల వల్ల ఆయన చూపు కోల్పోయారు. దాదాపు 20 రకాల మందులు వాడుతున్నారు. ఆయన సరైన వైద్యం అందించకపోతే జైల్లోనే చనిపోతారు అని హార్వే తరపు న్యాయవాది వాదించారు.

Recommended Video

నిజం సమాధి చేసేందుకు రెండన్నర కోట్లు ఇచ్చిన హీరోయిన్....!
 సామాజిక సేవ చేశాడు.. బెయిల్ ఇవ్వండి

సామాజిక సేవ చేశాడు.. బెయిల్ ఇవ్వండి

తన జీవితంలో సామాజిక సేవకు పాల్పడ్డారు. ఎంతో మందికి ఆయన ఆర్థికంగా, ఇతర రకాలుగా సహాయపడ్డారు. ఆయన చేసిన సామాజిక సేవను పరిగణనలోకి తీసుకొని మానవతా దృక్పథంతో ఆయన శిక్ష విషయంలో మరోసారి ఆలోచించండి అంటూ హార్వే తరఫు న్యాయవాది తన వాదనల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హార్వే చేసిన సామాజిక, స్వచ్ఛంద సేవకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కోర్టుకు సమర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X