ఆ స్టార్ హీరోయిన్‌ నాతో పడుకుంది అంటూ గొప్పగా చెప్పుకున్న నిర్మాత!

హాలీవుడ్ చిత్రసీమలో హార్వీ వెయిన్‌స్టెన్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. . ఏంజెలీనా జోలీ, గైనెత్ పాల్ట్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లను సైతం ఇతడు లైంగికంగా వేధించాడు. కొందరు నటీమణులను రేప్ చేసినట్లు కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. హార్వీ వెయిన్‌స్టెన్ వ్యవహారం తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం మొదలైంది.

కొందరు నటీమణులను లొంగదీసుకోవడానికి ఇతగాడు స్టార్ హీరోయిన్లతో తనకు లైంగిక సంబంధం ఉందంటూ గొప్పలు చెప్పుకునేవాడట. జేన్ డో అనే నటి తాజాగా అతడిపై ఫైల్ చేసిన లా సూట్ డాక్యుమెంట్లో ఓ సంచలన విషయం పేర్కొంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిపర్ లారెన్స్ కూడా తనతో పడుకుంది అంటూ వెయిన్‌స్టెన్ గొప్పగా చెప్పుకునే వాడని తెలిపింది.

హార్వీ వెయిన్‌స్టెన్ మీద మరో కొత్త లైంగిక వేధింపుల కేసు

హార్వీ వెయిన్‌స్టెన్ మీద మరో కొత్త లైంగిక వేధింపుల కేసు

హార్వీ వెయిన్‌స్టెన్ మీద మరో కొత్త లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జేన్ డో అనే యువతి అతడిపై లా సూట్ దాఖలు చేసింది. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లో అతడిని తొలిసారి కలిసినట్లు ఆమె తన లాసూట్ డాక్యుమెంట్లో పేర్కొందని టిఎంజెడ్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.

నా ముందే హస్త ప్రయోగం చేసుకునేవాడు

నా ముందే హస్త ప్రయోగం చేసుకునేవాడు

కొన్నాళ్ల పరిచయం తర్వాత హార్వీ వెయిన్‌స్టెన్ తనతో చాలా నీచంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. నా ముందే హస్తప్రయోగం చేసుకునేవాడు, బలవంతంగా నా చేతిని అతడి అంగంపై పెట్టించే ప్రయత్నం చేసేవాడని, ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేసేవాడని... జేన్ డో తన లా సూట్లో పేర్కొన్నారు.

జెన్నిపర్ లారెన్స్ నాతో పడుకుందని గొప్పలు

జెన్నిపర్ లారెన్స్ నాతో పడుకుందని గొప్పలు

నన్ను లొంగదీసుకోవడానికి గొప్పలు చెప్పుకునేవాడు. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ తనతో పడుకుందని, ఆ తర్వాత గొప్ప స్థాయికి వెళ్లడంతో పాటు ఆస్కార్ కూడా గెలుచుకుందని ప్రగల్బాలు పలికేవాడని జేన్ డో తన లా సూట్లో పేర్కొన్నారు.

జెన్నిఫర్ లారెన్స్ రియాక్షన్

జెన్నిఫర్ లారెన్స్ రియాక్షన్

హార్వీ వెయిన్‌స్టెన్‌ వ్యవహారంపై జెన్నిఫర్ లారెన్స్ స్పందించారు. ‘హర్వీ వెయిన్‌స్టెన్ వల్ల ఇంత మంది మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసిన తర్వాత షాక్ అయ్యాను. నాకు అతడితో ఎలాంటి లైంగిక సంబంధం లేదు. అయితే వృత్తి పరంగా ప్రొఫెషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది. నేను అతడితో పడుకున్నానని చెప్పడం... మహిళలను లొంగదీసుకోవడానికి వేసే ఎత్తుగడ లాంటిది' అని జెన్నిఫర్ లారెన్స్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X