Just In
- 1 hr ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 2 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 2 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 3 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
80 మందికిపైగా మహిళలపై నిర్మాత రేప్, ఓరల్ సెక్స్.. సినీ కీచకుడికి 23 ఏళ్ల జైలుశిక్ష
హాలీవుడ్ సినీ ప్రముఖుడు హార్వే వెయిన్‌స్టెయిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైంగిదాడి, అత్యాచారం, మానభంగం కేసుల్లో హార్వేకు న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు కఠిన జైలుశిక్ష విధించింది. కొద్ది రోజుల క్రితం దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. కోర్టు తీర్పుతో హార్వే కోర్టులోనే కుప్పకూలాడు. తన తరఫు న్యాయవాదిపై కన్నీటి పర్యంతం కావడం జరిగింది. తీర్పు అనంతరం.. పురుషులపై కక్ష కట్టి అన్యాయం చేస్తున్నారు. ఈ దేశంలో ఏం జరుగుతున్నది అంటూ హర్వే కోర్టులో కుప్పకూలాడు. ఈ కోర్టు తీర్పును న్యాయమూర్తి జేమ్స్ బుర్కే ప్రకటిస్తూ..

మొత్తం 29 సంవత్సరాల జైలుశిక్ష
రేప్‌తోపాటు ఇతర కేసుల్లో హార్వే వెయిన్‌స్టెయిన్‌పై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యులను విచారించిన అనంతరం కోర్టు అతడిని 2020 ఫిబ్రవరి 24వ తేదీన దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో హర్వేకి 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. 20 ఏళ్లు క్రిమినల్ సెక్స్, మూడేళ్లు రేప్ చేసినందుకు, ఇతర కేసుల్లో అదనంగా మరో 6 ఏళ్లు మొత్తం 29 సంవత్సరాలు జైలులో గడపాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి జేమ్స్ బుర్కే పేర్కొన్నారు.

పక్కా దర్యాప్తు, సాక్షుల విచారణ
ప్రపంచ సినిమా పరిశ్రమను కుదిపేసిన మీటూ ఉద్యమంలో భాగంగా ఆరుగురు మహిళా సెలబ్రిటీలు దాఖలు చేసిన కేసుల్లో సాక్ష్యాలను విచారించిన తర్వాత తీర్పును ఖారారు చేశాం. ఇందులో ఇద్దరు కేసు దాఖలు చేయగా, నలుగురు సాక్షులుగా వ్యవహరించారు అని న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. హర్వేకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించే సమయంలో కేసు దాఖలు చేసిన వారు, అలాగే సాక్షులు కూడా హాజరయ్యారు. ఈ తీర్పు సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన ఓ నటి కూడా తన స్నేహితురాలికి మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు.

వీల్ చైర్‌లో హార్వే
లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్వే వెయిన్‌స్టెయిన్ కోర్టుకు వీల్‌చైర్‌లో హాజరయ్యారు. తీర్పు అనంతరం మన్‌హట్టన్ కోర్టు నుంచి న్యూయార్క్ సిటీలోని ఫిష్‌కిల్‌లో ఉన్న డౌన్‌స్టేట్ కరెక్షనల్ ఫెసిలిటికి హార్వేను తరలించారు. అక్కడి నుంచి అతడిని లాస్ ఏంజెలెస్ ఖైదీగా శిక్షను అనుభవించనున్నారు. త్వరలోనే ఆయనను లాస్ ఏంజెలెస్ జైలుకు తరలిస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి.


నమోదైన కేసులు ఇవే
నిర్మాత హర్వే వెయిన్‌స్టెయిన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బలవంతంగా అత్యాచారం, ఓరల్ సెక్స్‌కు బలవంతం చేయడం, తమ ఇష్టానికి వ్యతిరేకంగా మహిళలపై లైంగిక దాడులు చేయడం లాంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నాడు. దాదాపు 30 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు దాఖలు చేయడం గమనార్హం.