twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    80 మందికిపైగా మహిళలపై నిర్మాత రేప్, ఓరల్ సెక్స్.. సినీ కీచకుడికి 23 ఏళ్ల జైలుశిక్ష

    |

    హాలీవుడ్ సినీ ప్రముఖుడు హార్వే వెయిన్‌స్టెయిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైంగిదాడి, అత్యాచారం, మానభంగం కేసుల్లో హార్వేకు న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు కఠిన జైలుశిక్ష విధించింది. కొద్ది రోజుల క్రితం దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. కోర్టు తీర్పుతో హార్వే కోర్టులోనే కుప్పకూలాడు. తన తరఫు న్యాయవాదిపై కన్నీటి పర్యంతం కావడం జరిగింది. తీర్పు అనంతరం.. పురుషులపై కక్ష కట్టి అన్యాయం చేస్తున్నారు. ఈ దేశంలో ఏం జరుగుతున్నది అంటూ హర్వే కోర్టులో కుప్పకూలాడు. ఈ కోర్టు తీర్పును న్యాయమూర్తి జేమ్స్ బుర్కే ప్రకటిస్తూ..

     మొత్తం 29 సంవత్సరాల జైలుశిక్ష

    మొత్తం 29 సంవత్సరాల జైలుశిక్ష

    రేప్‌తోపాటు ఇతర కేసుల్లో హార్వే వెయిన్‌స్టెయిన్‌పై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యులను విచారించిన అనంతరం కోర్టు అతడిని 2020 ఫిబ్రవరి 24వ తేదీన దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో హర్వేకి 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. 20 ఏళ్లు క్రిమినల్ సెక్స్, మూడేళ్లు రేప్ చేసినందుకు, ఇతర కేసుల్లో అదనంగా మరో 6 ఏళ్లు మొత్తం 29 సంవత్సరాలు జైలులో గడపాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి జేమ్స్ బుర్కే పేర్కొన్నారు.

    పక్కా దర్యాప్తు, సాక్షుల విచారణ

    పక్కా దర్యాప్తు, సాక్షుల విచారణ

    ప్రపంచ సినిమా పరిశ్రమను కుదిపేసిన మీటూ ఉద్యమంలో భాగంగా ఆరుగురు మహిళా సెలబ్రిటీలు దాఖలు చేసిన కేసుల్లో సాక్ష్యాలను విచారించిన తర్వాత తీర్పును ఖారారు చేశాం. ఇందులో ఇద్దరు కేసు దాఖలు చేయగా, నలుగురు సాక్షులుగా వ్యవహరించారు అని న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. హర్వేకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించే సమయంలో కేసు దాఖలు చేసిన వారు, అలాగే సాక్షులు కూడా హాజరయ్యారు. ఈ తీర్పు సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ఓ నటి కూడా తన స్నేహితురాలికి మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు.

    వీల్ చైర్‌లో హార్వే

    వీల్ చైర్‌లో హార్వే

    లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్వే వెయిన్‌స్టెయిన్ కోర్టుకు వీల్‌చైర్‌లో హాజరయ్యారు. తీర్పు అనంతరం మన్‌హట్టన్ కోర్టు నుంచి న్యూయార్క్ సిటీలోని ఫిష్‌కిల్‌లో ఉన్న డౌన్‌స్టేట్ కరెక్షనల్ ఫెసిలిటికి హార్వేను తరలించారు. అక్కడి నుంచి అతడిని లాస్ ఏంజెలెస్ ఖైదీగా శిక్షను అనుభవించనున్నారు. త్వరలోనే ఆయనను లాస్ ఏంజెలెస్ జైలుకు తరలిస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

    Recommended Video

    కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కూడా ? | Filmibeat Telugu
     నమోదైన కేసులు ఇవే

    నమోదైన కేసులు ఇవే

    నిర్మాత హర్వే వెయిన్‌స్టెయిన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బలవంతంగా అత్యాచారం, ఓరల్ సెక్స్‌కు బలవంతం చేయడం, తమ ఇష్టానికి వ్యతిరేకంగా మహిళలపై లైంగిక దాడులు చేయడం లాంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నాడు. దాదాపు 30 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు దాఖలు చేయడం గమనార్హం.

    English summary
    Former Hollywood producer Harvey Weinstein has been sentenced to 23 years in prison. Judge James Burke announced the sentence for Harvey - 20 years for the criminal sex act and three years for rape. He was going to be sentenced to nine-29 years of prison for the charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X