సినీ కీచకుడికి మరో 4 ఏళ్లు జైలుశిక్ష..ఇప్పటికే 23 ఏళ్ల దండన
లైంగిక దాడుల కేసులో హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ ఇప్పటికే 23 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లొని బఫెల్లోకు సమీపంలోని జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా భారీ శిక్షను అనుభవిస్తున్న హార్వేపై మరో పిడుగు పడింది. మరో కేసులో ఆయనకు అదనంగా నాలుగు సంవత్సరాల జైలుశిక్షను అనుభవించాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
2010లో బేవర్లీ హిల్స్ హోటల్ రూమ్‌లో ఓ మహిళపై లైంగిక దాడి జరిపినట్టు నమోదైన కేసులో హార్వే దోషిగా తేలారు. మీటూ ఉద్యమంలో భాగంగా 2019 అక్టోబర్‌లో పోలీసులు ఓ మహిళను విచారించగా ఆమె సాక్ష్యాధారాలను అందజేసింది.

తాజాగా ప్రాసిక్యూషన్ వాదనలతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి అదనంగా నాలుగేళ్లు శిక్షను విధించారు. త్వరలోనే అధికారికంగా ఆయనకు కోర్టు ఆదేశాలు అందజేస్తారు. దాంతో ఆయన శిక్ష 27 ఏళ్లకు పెరుగుతుంది.
ఇటీవల హార్వేపై మరో రెండు కేసులు విచారణకు వచ్చాయి. కానీ బాధితులు సాక్ష్యాలు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఈ రెండు కేసుల్లో కొంత ఊరట లభించింది.


Click it and Unblock the Notifications











