»   » ఎంతో మంది హీరోయిన్ల జీవితాలు నాశనం చేశాడు: రెస్టారెంట్లో దొరికిన నిర్మాత‌పై దాడి!

ఎంతో మంది హీరోయిన్ల జీవితాలు నాశనం చేశాడు: రెస్టారెంట్లో దొరికిన నిర్మాత‌పై దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
రెస్టారెంట్లో దొరికిన నిర్మాత‌పై దాడి !

హార్వీ వెయిన్ స్టన్.... ఈ పేరు వింటే చాలు ప్రపంచ సినీ పరిశ్రమతో పాటు, అతడు చేసిన నీచాల గురించి తెలిసిన ప్రతి సినీ అభిమాని అసహ్యించుకుంటాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది నటీమణులను లైంగికంగా వేధించాడు. కొందరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. ఇలాంటి నీచుడు కనిపిస్తే జనం ఊరుకుంటారా?

 హార్వీ వెయిన్‌స్టన్

హార్వీ వెయిన్‌స్టన్

హార్వీ వెయిన్‌స్టన్, హాలీవుడ్లో పేరు మోసిన నిర్మాత. మూవీ మొఘల్. తన సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం, ఆపై వారిని లైంగికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, తన కామ కోరికలు తీర్చుకోవడం. ఇదే అతగాడి పని. ఇలా ఏళ్ల తరబడి తన పైశాచికత్వాన్ని కొనసాగించి ఎంతో మంది నటీమణుల జీవితాలు నాశనం చేశాడు.

పాపం పండింది

పాపం పండింది

చాలా ఏళ్లుగా ఇతడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ... 2017లో అతడి పాపం పండింది. హర్వే వెయిన్‌స్టెయిన్‌ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏంజలీనా జోలీ, గైనెత్ పాల్ట్రో లాంటి టాప్ హీరోయిన్లతో పాటు పలువురు ప్రముఖ నటీమణులు అతడి సెక్స్ వేధింపుల గురించిబయట పెట్టారు. హార్వేకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో #metoo పెద్ద ఉద్యమమే సాగిన సంగతి తెలిసిందే.

రెస్టారెంట్లో దొరికిపోయిన హార్వీ వెయిన్ స్టన్

రెస్టారెంట్లో దొరికిపోయిన హార్వీ వెయిన్ స్టన్

లైంగిక వేధింపుల భాగోతం బయటపడ్డప్పటి నుండి హార్వీ వెయిన్‌స్టన్ బయట తిరగడం మానేశాడు. ప్ర‌స్తుతం రీహాబిలిటేష‌న్‌లో ఉన్న ఆయ‌న, జ‌న‌వ‌రి 9 రాత్రి స‌మ‌యంలో అరిజోనాలో ఉన్న ప్యార‌డైజ్ రెస్టారెంట్‌కి డిన్నర్ చేసేందుకు వ‌చ్చి జనాలకు దొరికిపోయాడు.

చెంప చెల్లుమనిపించారు

చెంప చెల్లుమనిపించారు

రెస్టారెంట్లో స్టీవ్ అనే వ్యక్తి హార్వీ వెయిన్ స్టన్ చెంప చెల్లుమనిపించాడు. మీతో ఫోటోలు దిగుతానంటూ అతడి దగ్గరి వరకు వచ్చిన స్టీవ్ అందరి ముందు ఆ నిర్మాత చెంపలు వాయించి పరువు తీశాడు.

తగిన శాస్త జరిగిందంటున్న జనం

తగిన శాస్త జరిగిందంటున్న జనం

పది మందిలో హార్వీ వెయిన్‌స్టన్‌ చెంపలు వాయించిన వ్యక్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హార్వీ లాంటి వారిని ఊరికే వదలి పెట్టవద్దని, స్టీవ్ అనే వ్యక్తి ఆ కామాత్ముడికి తగిన బుద్ది చెప్పారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

వీడియో వైరల్

వీడియో వైరల్

హార్వీ వెయిన్‌స్టన్ చెంపలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇలా అన్ని మాధ్యమాల్లో ఈ వీడియో ట్రెడింగ్ అయిపోయింది.

 ఆస్కార్ కమిటీ నుండి ఔట్

ఆస్కార్ కమిటీ నుండి ఔట్

హార్వీ వెయిన్‌స్టాన్ చేసిన పాపాలు చివరకు అతడిని చరిత్ర హీనుడిగా దిగజారేలా చేసింది. ఇప్పటికే ఆస్కార్ అవార్డుల కమిటీ ( అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్‌ సైన్సెస్‌) నుండి కూడా అతడిని తొలగించారు.

ఇంట్లో వారు కూడా అసహ్యించుకుంటున్నారు

వెయిన్‌స్టెయిన్‌ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో వెయిన్ స్టోయిన్ కంపెనీ నుంచి వెలివేస్తున్నట్లు అతడి సోదరుడు బాబ్‌ వెయిస్టెన్‌ ప్రకటించాడు. తన సోదరుడు ఓ మృగమంటూ బాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Harvey Weinstein was on the receiving end of 2 backhanded slaps to the face ... that's what the newly-obtained video shows. Weinstein was dining Tuesday night at Elements restaurant in Scottsdale when a guy named Steve approached him and asked for a photo. Steve tells TMZ Weinstein was belligerent and said no, while a restaurant manager says Weinstein was "sweet" and politely declined.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X