11-11-11 నెంబర్ కి అంత శక్తి వుందా...?
హార్రర్ మరియు త్రిల్లర్ చిత్రాలను తీయడానికే మాత్రమే పుట్టినట్టు 'డారెన్ బోస్ మెన్'ఎప్పుడూ భయంకరమైన హార్రర్ చిత్రాలను తీస్తుంటారు. మచ్చుతునకకి మికోక సినిమా పేరు చెప్తాను 'సా'. ఈ సినిమా 60 సంవత్సరాలున్న ఎవరు చూసిన వారు గ్యారంటీగా స్వర్గానికి వెళతారు. దీనిని బట్టి మీకు అర్దం అయ్యే వుంటుంది 'డారెన్ బోస్ మెన్' ఎలాంటి సినిమాలు తీస్తాడో. 'సా' సినిమా తర్వాత సాII, సాIII, సాIV విడుదల చేశారు. ఇవి బాక్సా ఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి.
నెం 11కి చాలా ప్రత్యేకత వుందని, జనవరి 11 నా పుట్టిన రోజని చెప్పారు. అంతేకాకుండా నెం 11లో ఒక హిస్టారికల్ పవర్ వుందని అన్నారు. ఇక కథ విషయానికి వస్తే సినిమా మొత్తం సస్పెన్స్, థ్రిల్లర్ తో వుంటుందని, స్వర్గానికి 11 గేట్స్ వుంటాయని, ఆ గేట్స్ పదకొండవ నెలలో పదకొండవ రోజున పదకొండవ తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు తెరచుకుంటాయని, తర్వాత వారు ఒక కోత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. అక్కడ వారు ఎదుర్కోన్న పరిస్థితులు ఎలా వుంటాయనేది సారాంశం. ఈ సినిమా తీయడానికి ముఖ్యఉధ్దేశం 'ఫ్రీక్ పీపుల్ అవుట్'అని అన్నారు. దీనిని బట్టి మనకు ఏమి అర్థం అవుతుంది అంటే భయపడేవాళ్శు ఈ సినిమా చూడకూడదన్నమాట.
ఇంతకీ సినిమా పేరు ఏంటా అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అభిమానులకు శుభవార్తను ఆయనే స్వయంగా వెల్లడించారు. నేను తీయబోయే తాజా చిత్రం పేరు '11-11-11'. ఈ సినిమాకి రైస్ నిర్మాతగా వ్వవహారిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్ 11, 2011న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications











