Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వేశ్య పాత్ర కోసం జుట్టు కత్తిరించుకున్న స్టార్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే తాను త్వరలో నటించనున్న 'లెస్ మిసరబెల్స్' చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రని పోషిస్తున్నారు. ఈ సెక్స్ వర్కర్ పాత్ర కోసం తన పొడవైన బ్రోన్ హెయిర్‌ని పాత్రకు తగ్గట్లుగా పొట్టిగా కత్తిరించుకునేందుకు సిద్దమైనట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం.
29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే తన కాబోయే భర్త ఆడమ్ సుల్మన్‌తో కలసి సోహో నైట్ క్లబ్‌కి వచ్చారు. ఈ సందర్బంగా అన్నే హాత్వేని అక్కడ చూసిన అభిమానులు అన్నే హాత్వే తన కొత్త హెయిర్ స్టైల్‌ని చేతులతో కవర్ చేస్తూ ఎందుకు వెళ్తుందో అర్దం కాలేదు. తీరా ఆరా తీస్తే తాను త్వరలో నటించనున్న 'లెస్ మిసరబెల్స్' అనే చిత్రం కోసం గాను ఈ కొత్త హెయిర్ స్టైల్‌ని చేయించిందని అక్కడున్న వారు తెలుసుకునే సరికే అన్నే హాత్వే అక్కడ నుండి జారుకున్నారు.
'లెస్ మిసరబెల్స్' చిత్రంలో అన్నే హాత్వేతో పాటు హీరోగా ఆస్టేలియన్ హాగ్ జాక్స్ మెన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అన్నే హాత్వే పోషిస్తున్న పాత్ర పేరు 'ఫాంటైన్'. తన బిడ్డకు ఆహారం పెట్టేందుకు డబ్బులు లేని పరిస్దితిలో వ్యవిఛార వృత్తిని ఎంచుకోని.. తన హెయిర్‌ని అమ్ముకునే పాత్రలో అన్నే హాత్వే నటిస్తున్నారు. హాగ్ జాక్స్ మెన్, అన్నే హాత్వేతో పాటు రస్సెల్ క్రో ఓ అధ్బుతమైన పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవలే హాలీవుడ్ ఏంజిల్ 'అన్నే హాత్వే' మొన్న శనివారం తన చిరకాల డేటింగ్ బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మన్‌తో 125 మంది గెస్టుల సమక్షంలో మాన్హాట్టన్లో ఉన్న 'హౌసింగ్ వర్క్స్ బుక్ స్టోర్ కేఫ్' ఎంగేజ్ మెంట్ కార్యక్రమం హాట్టహాసంగా జరిగింది. 2008వ సంవత్సరం నుండి కూడా వీరిద్దరి మద్య జరుగుతున్న డేటింగ్ వ్యవహారానికి మొన్నటితో బ్రేక్ పడింది.
వీరిద్దరి ఎంగేజ్మెంట్కు వచ్చిన అతిధిలకు, స్నేహితులకు.. ఫ్యామిలీ సన్నిహితులకు పార్టీ మాత్రం న్యూయార్క్‌లో ప్లాన్ చేసినట్లు అన్నే హాత్వే తెలిపారు. ఈ సందర్బంలో అన్నే హాత్వే మాట్లాడుతూ నేను ఆడమ్ సుల్మన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్నాం. అతనంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఐతే మొదట మేమిద్దరం సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆ ప్లాన్ మాత్రం సక్సెస్ కాలేదంటూ నవ్వుతూ అన్నారు.