twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jeremy Renner: 'అవేంజర్స్' నటుడికి సర్జరీ.. మొద్దుబారిపోయిన ఛాతిభాగం.. వైద్యులు ఏం చెప్పారంటే?

    |

    ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్వెల్ సూపర్ హీరో జెరెమి రెన్నర్ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురైన క్లింట్ బార్టన్ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్లో అతని పేరు) అకా జెరెమి రెన్నర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో జెరెమి రెన్నర్ కు మెరుగైన వైద్యం అందించారు. అయితే సోమవారం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు జెరెమి రెన్నర్ కు శస్త్ర చికిత్స చేసినట్లు తాజాగా వెల్లడించారు. అవేంజర్స్ నటుడు జెరెమి రెన్నర్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం వైద్యులు ఇచ్చిన హెల్త్ బులెటిన్ వివరాల్లోకి వెళితే..

     గాయాలపాలైన నటుడు..

    గాయాలపాలైన నటుడు..

    అమెరికాను మంచు తుపాను తీవ్రంగా ముంచేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు తుపాను తాకిడి తీవ్రంగా ఉంది. అలా డిసెంబర్ 31 నుంచి జనవరి 1 లోపే రోడ్లపై 5 అడుగుల మేర రోడ్లపై మంచు కప్పేసి ఉంది. నెవాడాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. మంచు తుపాను కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవిస్తోందని అక్కడి రిపోర్టులు ఇదివరకే పేర్కొన్నాయి. నార్త్ నెవెడాలో దాదాపుగా 35 వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సమాచారం. ఈ క్రమంలోనే మంచును తొలగిస్తూ 51 ఏళ్ల అవేంజర్ నటుడు జెరెమి రెన్నర్ గాయాలపాలయ్యాడు.

    న్యూ ఇయర్ రోజున..

    న్యూ ఇయర్ రోజున..

    జెరెమి రెన్నర్ వాషో కౌంటీలో తన సొంత ఇంటిలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఇంటిపై భాగంలో భారీగా మంచు పేర్కొంది. దాన్ని తొలగిద్దామని న్యూ ఇయర్ రోజున భారీ వాహనంతో జెరెమి రెన్నర్ ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతన్ని హెలికాఫ్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు. అతనికి వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. అయితే సోమవారం ఆయనకు పరిస్థితి విషమం కావడంతో వెంటనే ఐసీయూలోకి చేర్పించారు.

     భయపడాల్సింది లేదు..

    భయపడాల్సింది లేదు..

    అనంతరం సర్జరీ చేశారు వైద్యులు. అయితే మంచు కారణంగా ఆయన ఛాతి బాగం మొద్దుబారిపోయిందని వైద్యులు తెలిపారు. అందుకే శస్త్ర చికిత్స చేయాల్సివచ్చిందని వారు పేర్కొన్నారు. అలాగే జెరెమి రెన్నర్ కు కుడి మోచేయి.. ఎడమ చేయి మణికట్టు విరిగినట్లు సోమవారం వెరైటీ వెబ్ సైట్ పేర్కొంది. ప్రమాదంలో ఛాతి భాగం మొద్దుబారిపోవడం, కొన్ని ఆర్థోపెడిక్ గాయాలు మాత్రమే అయ్యాయని, అంతేతప్పా భయపడాల్సింది ఏం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

     అభిమానులకు కృతజ్ఞతలు..

    అభిమానులకు కృతజ్ఞతలు..

    ఈ సంఘటనపై జెరెమి రెన్నర్ కుటుంబ సభ్యులు స్పందించారు. జెరెమికు మెరుగైన వైద్యం అందించిన వైద్యులకు, అతన్ని బాగా చూసుకున్న నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాషో కౌంటీ పోలీసులకు, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కు, హిల్లరీ స్కీవ్, కారానో, మర్డాక్ కుటుంబాలతోపాటు జెరెమి రెన్నర్ అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది జెరెమి కుటుంబం. అభిమానుల ప్రేమాభిమానాల వల్ల జెరెమి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు.

    ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ కు..

    ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ కు..

    ఇదిలా ఉంటే.. జెరెమి రెన్నర్ ఇప్పటికీ రెండు సార్లు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ కు ఎంపికయ్యాడు. 2010లో ది హార్ట్ లాకర్ చిత్రానికి ఉత్తమ నటుడిగా, ది టౌన్ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా అకాడమీ అవార్డ్స్ కు ఎంపికయ్యాడు. జెరెమి రెన్నర్ అవేంజర్స్, హాకీ చిత్రాల్లోనే కాకుండా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ మూవీ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ చిత్రాల్లో కూడా నటించాడు. ఇంకా అరైవల్, అమెరికన్ హాస్టిల్, 27 వీక్స్ తర్వాత వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం మేయర్ ఆప్ కింగ్స్ టౌన్ చిత్రంలో నటిస్తున్నాడు.

    English summary
    Hollywood Marvel Super Hero Jeremy Renner Out Of Surgery For Chest And Orthopedic Injuries After Met Accident While Plowing Snow In Nevada
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X