twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజిక్ అవార్డులలో నగ్నంగా ఆగంతకుడి హల్ చల్

    By Nageswara Rao
    |

    ఎమ్‌టివి యూరప్ మ్యూజిక్ అవార్డులు జరుగుతున్న సందర్బం. అక్కడ ఓ సంఘటన అక్కడున్న అందరి సెలబ్రిటీలను కలవర పరిచింది. వివరాల్లోకి వెళితే హాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'హాయడెన్ పెనట్రీ' మైఖ్‌తో స్టేజి మీదకు బెస్ట్ సాంగ్ అవార్డుని ప్రకటించడానికి రావడం జరిగింది. అదే సందర్బంలో డేవిడ్ మోనహాన్ అనే ఆగంతకుడు ఒంటి మీద ఎటువంటి ఆచ్చేధనం లేకుండా(నగ్నంగా) స్టేజి మీదకు రావడంతో అప్పటికే స్టేజీ మీద ఉన్న 'హాయడెన్ పెనట్రీ' ఒక్కసారిగా కంగారు పడిపోయారు.

    ఇక డేవిడ్ మోనహాన్ విషయానికి వస్తే బెల్ఫెస్ట్ స్టార్ హీరో. స్వదేశంలోనే కాకుండా, విదేశాలలో చాలా స్టేజిలలో ప్రదర్శలను ఇచ్చి తనదైన శైలిలో అభిమానులను ఆకర్షించాడు. 24 సంవత్సరాలు వయసు కలిగిన డేవిడ్ మోనహాన్ సడన్‌గా స్టేజి మీదకు నగ్నంగా రావడానికి గల కారణాలను అక్కడే వివరించాడు. ఈ సందర్బంలో డేవిడ్ మోనహాన్ మాట్లాడుతూ నేను ఇలా నగ్నంగా రావాలని ఏమీ ప్లాన్ చేయలేదు. అది ఏదో కాకతీయంగా జరిగిపోయింది.

    నాకు తెలిసినటువంటి ఇద్దరు సన్నహితులు సెక్యూరిటీగా పని చేస్తున్నారు. వారే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ నేను ఇలా నగ్నంగా ఇక్కడకు వస్తానని వారికి కూడా తెలియదని అన్నారు. స్టేజి వెనుక భాగాన ఉన్న స్టోర్ రూమ్ నుండి ఇలా అందరికి సడన్‌‍గా ఆశ్చర్యాన్ని కలగజేసేందుకే వచ్చానని అన్నాడు. అదే సమయంలో అక్కడున్న వారంతా ఇది పబ్లిసిటీలో భాగంగా ఇలా చేస్తున్నావా అని ప్రశ్నించగా, అలాంటిది ఏమీ లేదని తెలిపాడు. అసలు స్టేజి మీదకు నగ్నంగా వస్తే ఏమి జరుగుతుందో చూద్దామనే ఉద్దేశ్యంతోనే వచ్చానని అన్నాడు.

    ఎమ్‌టివి అవార్డుల కార్యక్రమంలో ఆరు భాగాలకు నామినేట్ అయిన లేడిగాగా నాలుగు భాగాలలో ఎమ్‌టివి ఈఎమ్ఎ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ సాంగ్ అవార్డుని లేడిగాగా సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే లేడిగాగా అవార్డుని తీసుకొని వెళ్లిపోయారో, వెంటనే డేవిడ్ మోనహాన్ స్టేజి మీదకు రావడం జరిగింది.

    English summary
    The Heroes actress was about to present the award for Best Song - which eventually went to Lady Gaga - when a naked man appeared on stage who we can exclusively reveal is David Monahan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X