HBD Jennifer Lopez: మాజీ భార్యతో కలుస్తున్న బెన్.. ఊహించని షాకిచ్చిన జెన్నిఫర్ లోపెజ్
జెన్నిఫర్ లోపెజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది సుదీర్ఘ కాలంగా హాలీవుడ్‌లో సింగర్‌గా, డ్యాన్సర్‌గా, నటిగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుని సత్తా చాటుతోంది. ఇప్పటికీ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గానే సాగిపోతోన్న ఈ భామ.. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి కారణం ఆమె ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడమే అని చెప్పాలి. ఇలా జెన్నిఫర్ లోపెజ్ వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్.. 2022లో తన మాజీ భర్త బెన్ అఫ్లెక్‌ను మరోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైవాహిక జీవితాన్ని ఈ బ్యూటీ చక్కగానే నడుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జంట మధ్య 'డెడ్‌పూల్ 3' అనే సినిమా చిచ్చు పెట్టేలా తయారైనట్లు ఓ న్యూస్ హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

'డెడ్‌పూల్ 3' సినిమాలో బెన్ అఫ్లెక్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. గతంలో అతడు నటించిన 'డేర్ డెవిల్' సినిమాలోని పాత్రతోనే ఇందులోనూ మెరవబోతున్నాడట. అయితే, అప్పుడు అతడికి జోడీగా చేసిన మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ కూడా 'డెడ్‌పూల్ 3'లో నటిస్తుందని తెలిసింది. వీళ్లిద్దరూ ఈ చిత్రంలో జంటగానే చేయబోతున్నట్లు సమాచారం.
బెన్ అఫ్లెక్ 'డెడ్‌పూల్ 3'లో నటించేందుకు ఒప్పందం చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోయినా.. తన సవతి అయిన జెన్నిఫర్ గార్నర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై జెన్నిఫర్ లోపెజ్ కోపంగా ఉందని తెలుస్తోంది. దీంతో తన వైవాహిక బంధానికి ఇబ్బందిగా మారకుండా ఉండడం కోసం తన భర్తకు ఈ బ్యూటీ ఈ సినిమా విషయంలో కొన్ని కండీషన్లు పెట్టి ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలిసింది.

హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'డెడ్‌పూల్ 3'లో బెక్ అఫ్లెక్ తన మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్‌తో కలిసి నటిస్తున్నాడు. దీంతో అతడి ప్రస్తుత భార్య జెన్నిఫర్ లోపెజ్ తనకు 24 గంటలు సెట్స్‌లోకి రావడానికి పర్మీషన్ ఉండాలని, వాళ్లిద్దరూ జంటగా ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, ఫొటోషూట్లు చేయరాదని, షూటింగ్ స్పాట్‌లో వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదని తేల్చి చెప్పిందట. వీటికి అఫ్లెక్ కూడా ఒప్పుకున్నాడని సమాచారం. దీంతో ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











