అతను ముమ్మాటికీ 'గే'నే..!!
ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ ఇంతవరకూ ఓ క్రాస్ డ్రెస్సర్ అనే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన గురించి ఓ సరికొత్త విషయం వెలుగుచూసింది బిగ్ బ్రదర్స్ రియాలిటీ షో వల్ల. లండన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ రియాలిటీ షోలో రెయిడ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇదే షోలో ఆయన రూమ్ మేట్ గా వున్న బిజినెస్ ఉమన్ హైదీ ఫ్లీయిస్ బిగ్ బ్రదర్స్ షో నుండీ వైదొలుగుతూ ఇచ్చిన ఇంటర్యూలో తన రూమేట్స్ గురించి మాట్లాడుతూ విపరీత వ్యాఖ్యలు చేసింది.
అలెక్స్ అతనో ఇడియట్...అతను క్రాస్ డ్రెస్సర్ గానే అందరికీ తెలుసు కానీ అతనిలో గే లక్షణాలు చాలా వున్నాయి. నాకున్న అనుభవం రిత్యా చెబుతున్నాను అతనికి ఇంతవరకూ చాలా మంది అబ్బాయిలతో సంబంధం ఉంది అని కుండ బద్దలుకొట్టింది. కాగా ఈ వ్యాఖ్యలను అలెక్స్ ప్రియురాలు క్యాటీ ప్రైజ్ కొట్టిపారేసింది. తన ప్రియుడి ఎదుగుదలను చూసి ఒర్వలేక ఇలాంటి ఆరోపనలు చేస్తున్నారని ఆక్షేపించింది. అంతే కాదు రెయిడ్ బిగ్ బ్రదర్స్ షో తర్వాత తనని వదిలేస్తాడు అని వస్తున్న ఆరోపనలను కూడూ ఆమె ఖండించారు.


Click it and Unblock the Notifications











