భర్త నుండి విడాకులు.. తండ్రి విచారం
జర్మన్ సూపర్ మోడల్ హైదీ క్లూమ్, ఆమె భర్త సీల్ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోనునట్లు సీల్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న హైదీ క్లూమ్ తండ్రి గున్థెర్ క్లూమ్ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో గున్థెర్ క్లూమ్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు కలసి జీవించిన ఈ జంట హాఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించడంతో తాను షాక్‌కి గురి అయ్యాయని అన్నారు. ఈ విషయంపై నేను, నా భార్య చాలా విచారంగా ఉన్నాం.
2005వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. హైదీ క్లూమ్ లాస్ ఏంజిల్స్ కోర్టులో తన భర్త నుండి వారం రోజులు లోపు విడాకులు కావాలని కోరుతూ పిటిషన్‌ని దాఖలు చేసింది. ఈ సందర్బంలో సీల్, బైదీ క్లూమ్ పెద్ద కూతురుని పెంచి పోషించే బాధ్యతలను తీసుకున్నారు.
గతంలో హైదీ క్లూమ్ తన యొక్క కాళ్లను $2 మిలియన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. హైదీ మాజీ విక్టోరియా సీక్రెట్ మోడల్‌గా వ్యవహారించారు. హైదీ తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించినప్పుడు హైదీని మీ కాళ్లను మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారా అని ప్రశ్నించగా దీనికి సమాధానమిస్తూ నా అంతటగా నేను ఇన్సూరెన్స్ చేయలేదు. నాకు సంబంధించిన క్లయింట్ ఇలా చేయడం జరిగిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











