భర్త నుండి విడాకులు కోరిన సూపర్ మోడల్
జర్మన్ సూపర్ మోడల్ హైదీ క్లూమ్, ఆమె భర్త సీల్ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోనునట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే 2005వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కలసి ఉన్న వీరిద్దరూ ఇటీవల కొన్ని మనస్పర్దల వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హైదీ క్లూమ్ భర్త సీల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
హైదీ క్లూమ్ లాస్ ఏంజిల్స్ కోర్టులో తన భర్త నుండి వారం రోజులు లోపు విడాకులు కావాలని కోరుతూ పిటిషన్‌ని దాఖలు చేసింది. ఈ సందర్బంలో సీల్, బైదీ క్లూమ్ పెద్ద కూతురుని పెంచి పోషించే బాధ్యతలను తీసుకున్నారు. గతయేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ర్యాంకులలో హైదీ క్లూమ్ $20 మిలియన్ల ఆదాయాన్ని సంవత్సరానికి సంపాదిస్తున్నట్లు తెలిసింది. ఇంకా చెప్పాలంటే హైదీ క్లూమ్, సీల్ ఇద్దరూ కూడా వారియొక్క్ మ్యారేజి పండుగని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకునే సెలబ్రిటీలలో అత్యుత్తమ జంటగా నిలిచారు.


Click it and Unblock the Notifications











