Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భర్త ఉన్నప్పుడు చాటుగా ఎఫైర్...ఇప్పుడు బరితెగించి!
బెర్లిన్ : పాశ్చాత్య దేశాల్లో వైవాహిక సంబంధాలకు పెద్దగా విలువ ఉండదనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. సినీ స్టార్లు, మోడల్స్ సంబంధాలైతే మరీను. పెళ్లి ముందే సెక్స్, పెళ్లయినా మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం, విడాకులు తీసుకోవడం, సెల్ ఫోన్ మార్చినంత వీజీగా మొగుళ్లను, భార్యలను, ప్రేమికులను మార్చడం అక్కడ కామన్.
తాజాగా అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. జన్మన్ సూపర్ మోడల్ హేడి క్లమ్ కొన్ని రోజుల క్రితమే బ్రిటిష్ సింగర్ అయిన ఆమె భర్త సీల్ నుంచి విడాకులు తీసుకుంది. హేడి ఆమె బాడీ గార్డ్ మార్టిన్ క్రిస్టెన్‌తో ఎఫైర్ నడుపుతోందనే అనుమానంతో సీల్ ఆమెకు విడాకులు ఇచ్చాడు.
అయితే ఈ వ్యవహారంపై హేడి మీడియాతో మాట్లాడుతూ...తన భర్త అనుమానించినట్లు తను ఏ మగాడో అక్రమ సంబంధం పెట్టుకోలేదని, తన భర్తతో కలిసున్నంత వరకు మరో మగాడి వైపు కన్నెత్తి చూడలేదని అంటోంది. ఇలా చెప్పడం ద్వారా తాను ప్రస్తుతం తాను ఇతర మగాళ్ల వైపు చూస్తున్నానని, ఎఫైర్లో ఉన్నానని చెప్పకనే చెప్పింది సెక్సీ హేడీ.
అయితే హేడీ-సీల్ సన్నిహితులు మాత్రం వాళ్ల బంధం విడిపోవడానికి హేడీ ప్రవర్తనే కారణమని, ఆమె సీల్‌తో కలిసున్నప్పుడు ఇతరులతో సంబంధాలు పెట్టుకుందని, అందువల్లే సీల్ ఆమె నుంచి విడిపోయాడని, సీల్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునే వాడు....కానీ హేడీ అతని నమ్మకాన్ని నిలబెట్టలేదు అంటున్నారు.