తుంటరి అభిమానుల నుండి రక్షించుకోవడానికే ఇలా చేయాల్సివస్తుంది..
హైదీ మాంటాగ్ ఒకే రోజు పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్. హైదీ మాంటాగ్ ఏది చేసినా అదోక పెద్ద వార్త. హీరోయిన్లు అన్నతర్వాత అప్పుడప్పుడు పబ్లిక్ లోకి వెళ్శివలసి ఉంటుంది. అలాంటి సమయంలో చాలా మంది ఆకతాయిలు హీరోయిన్లుని ఏడిపించడం చూశాం. ఎక్కడిదాకో ఎందుకు ఇటీవల కాలంలో హీరోయిన్ స్నేహా ఓషాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కివెళ్శినప్పుడు ఓతుంటరి ఆమె నడుము గిల్లి దోరికిపోయిన సంఘటన మనకు గుర్తే. ఇలాంటి సంఘటనల నుంచి హీరోయిన్లు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు హైదీ మాంటాగ్. అందుకే తను ప్రస్తుతం బిజీగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పనిలో ఉన్నారు. వీటితో పాటు మన దగ్గర ఉన్న డబ్బుకి కూడా మనం సెక్యూరిటీగా ఉండవచ్చు అంటున్నారు.
ప్రస్తుతానికి నేను సెక్యూరీటీ గార్డుని పెట్టుకోదలచుకోలేదు. దానికి కారణం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే. గతంలో చాలా డబ్బులు సెక్యూరిటీకి ఇస్తున్నామన్నారు. వీటితో పాటు ఎప్పుడైనా పబ్ కువెళ్శాలంటే ప్రోటక్షన్ నిమిత్తం 5 నుంచి 10 వేల డాలర్లు ఒక్కో రేత్రికి వెచ్చించాల్సివస్తుందని తెలిపారు. ఇంకోక విషయం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. ఇంకోక ఆరునెలలు ట్రైనర్ మైఖెల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే బ్లాక్ బెల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
చివరగా మాట్లాడుతూ నాఎత్తు ఐదు అడుగుల రెండు ఇంచలు ప్రస్తుతం ఉన్న పోజిషన్ లోనేను ఒక్కదాన్నే నన్ను కాపాడుకోవడం కోంచెం కష్టం. అందుకే నేను ఒక్కదాన్ని ఎక్కువ దూరం వెళ్శడం లేదు. ప్రోటక్షన్ లేకుండా బయటకు వెళ్శాలంటే చాలా భయంగా ఉంది. అందుకే సాద్యమైనంత వరకు తోందరగా ఈమార్షల్ ఆర్ట్స్ నేర్చుకోని ఒక్కదాన్నే బయటకు వెళ్శాలని అనుకుంటున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











