ఆ షో కి అందం తేవడానికి నేను వస్తున్నానంటున్న సెక్సీ భామ
హాలీవుడ్‌లో రియాలిటీ షోలకు చాలా పేరుంది. ముఖ్యంగా కిమ కర్దాషియాన్ నిర్వహించేటటువంటి షో 'కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్' అనే రియాలిటీ షో బాగా పాపులారిటీని తెచ్చుకుంది. ఇదే కోవలోకి యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించేటటువంటి మరో రియాలిటీ షో 'అమెరికన్ ఐడియల్' వస్తుంది. ఈరెండిటి తర్వాత హాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ రియాలిటీ షో 'రియల్ హౌస్‌వైప్స్ ఆఫ్ బేవరి హిల్స్'.
ప్రస్తుతం 'రియల్ హౌస్‌వైప్స్ ఆఫ్ బేవరి హిల్స్' షోని నిర్వహిస్తున్న నిర్వాహాకులు కామిల్లీ, లిసా, కేల్, గ్యాంగ్. వీరితో పాటు కొత్తగా ఈషోలో మరో సెలబ్రిటీ చేరనున్నారు. ఎవరా ఆకొత్త సెలబ్రటీ అనుకుంటున్నారా.. ఇంకెవరూ మన హాలీవుడ్ అందగత్తె హైదీ మాంటెగ్. ఈషోలో భాగంగానే ఇప్పటికే హైదీ మాంటెగ్ బేవరి హిల్స్‌కు చేరుకోవడం జరిగింది. హైదీ మాంటెగ్ రాకతో షోకి కొన్ని కొత్త హాంగులు రానున్నాయని అన్నారు.
హైదీ మాంటెగ్‌తో పాటు ఈవిషయాన్ని తన భర్త స్పెన్సర్ ప్రాట్ కూడా ధృవీకరించడం జరిగింది. ఈసందర్బంలో స్పెన్సర్ ప్రాట్ మాట్లాడుతూ హైదీ మాంటెగ్ 'రియల్ హౌస్‌వైప్స్ ఆఫ్ బేవరి హిల్స్' షోలో పాల్గోనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద అందరూ కలసి ఈషోని ముందుకి తీసుకోని వెళ్శాలని కోరుకుంటున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











