కాళ్లను ఇన్సూరెన్స్ చేయడానికి అంత ఖర్చ పెట్టిందా..?
జర్మన్ సూపర్ మోడల్ హైదీ క్లూమ్ తన యొక్క కాళ్లను $2 మిలియన్లకు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. హైదీ క్లూమ్ గతంలో మాజీ విక్టోరియా సీక్రెట్ మోడల్‌గా వ్యవహారించడం జరిగింది. ఈ సందర్బంలో హైదీ క్లూమ్‌ని మీ కాళ్లను మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారా అని ప్రశ్నించగా దీనికి సమాధానమిస్తూ నా అంతటగా నేను ఇన్సూరెన్స్ చేయలేదు. నాకు సంబంధించిన క్లయింట్ ఇలా చేయడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం నేను లండన్ ఉన్నాను. నా క్లయింట్ ఎక్కడైతే నాకాళ్లను ఇన్సూరెన్స్ చేయడం జరిగిందో అక్కడికి వెళ్లి త్వరలోనే చెక్ చేయించుకోవాల్సి వస్తుందని ఎక్సట్రా టివిలో వెల్లడించారు. గతంలో నాకు ఓ చిన్న మైనర్ గ్లాస్ దెబ్బ ఎడమ కాలికి తగిలిన సంగతి తెలిసిందే. సో దానిని బట్టి చూసుకుంటే నా ఎడమ కాలికంటే కుడికాలు ఎక్కవ రేటు ఉండవచ్చునని అన్నారు.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ వెల్లడించిన సమాచారం ప్రకారం 'ప్రాజెక్టు రన్ వే' జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించిన డౌన్లోడ్స్ ఎక్కవగా ఇంటర్నెట్లో అభిమానులు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద టాప్ పది డౌన్లోడ్స్ లలో ఈ జడ్జికి సంబంధించినవే ఎక్కవగా ఉండడంతో మెకాఫీ సంస్ద ఆమె వెబ్ సైట్లోకి వెళితే మీ పర్సనల్ కంప్యూటర్ డామేజి అవుతుందని అన్నారు. ఇంతకీ 'ప్రాజెక్టు రన్ వే' జడ్జి ఎవరనుకుంటున్నారా మన సూపర్ మోడల్ హైదీ క్లూమ్.


Click it and Unblock the Notifications











