వైభవంగా ఇండస్ట్రీ పెద్దల సమక్షంలోనే మా పెళ్లి
పెళ్లి అనేది జీవితంలో ఎంతో అందమైన ఘట్టం. అలాంటి ఘట్టాన్ని చాలా అందంగా దాచుకొవాలనేది నా ఉద్దేశ్యం అన్నారు ప్రముఖ్ సింగర్ హైదీ రేంజి. గత కొంత కాలంగా తనక కాబోయే పెళ్లికొడుకు దావి బెర్రీతో డేటింగ్ చేస్తున్న ఈ భామ డేటింగ్‌కి స్వస్తి పలికి వచ్చే సంవత్సరం(2012)లో ఇద్దరూ పెళ్లి చేసుకొవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పెళ్లికి గాను సింగర్ హైదీ రేంజి పెళ్లిరోజు వేసుకొబొయే డ్రస్సుని ఇప్పటి నుండి మెరుగులు దిద్దుకుంటున్నట్లు సమాచారం.
ఈ సందర్బంలో హైదీ రేంజి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం చలికాలంలో మా పెళ్లి తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. నా జీవితంలో జరగబోయే ఈ శుభప్రదమైన కార్యక్రమానికి ఇప్పటి నుండే డ్రస్సుని కూడా సిద్దం చేసుకొవడం జరిగిందని అన్నారు. ఇంక కేవలం చూడాల్సిందల్లా పెళ్లి ఎక్కడ చేసుకొవాలనేది మాత్రమేనని అన్నారు.
ఇక ఈ పెళ్లికి పెద్దలుగా మా చెల్లి, నా సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, నాకు కాబోయే భర్త దావి బెర్రీ చెల్లెలు ఉంటే నా అంత అదృష్టవంతురాలు ఉండరని ఈ సందర్బంగా తెలియజేసింది.


Click it and Unblock the Notifications











