బెస్ట్ బాడీ ఆఫ్ ద ఇయర్‌గా 66 సంవత్సరాల బామ్మ
బ్రటిష్ స్టార్ హీరోయిన్ హెలెన్ మిర్రన్ లాస్ ఏంజిల్స్ ఫిట్‌నెస్ పోల్‌లో ఆడవారిలో నెంబర్ వన్ బాడీ ఆఫ్ ద ఇయర్ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. 66 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఈ హెలెన్ మిర్రన్‌తో పాటు మొత్తం 2000 మంది ఆడవారు, మగవారు ఈ పోటీలో పాల్గోన్నారు. ఈ వయసులో కూడా హెలెన్ మిర్రన్ తన బికినీ బాడీని లేదా నగ్నంగా చూపించడానికి సంకోచించరు. ప్రక్కనున్న చిత్రం 2008వ సంవత్సరంలో హెలెన్ మిర్రన్ బికినీలో స్నానం చేస్తున్న ఫోటో. అంతేకాకుండా హెలెన్ మిర్రన్ శరీరం మానవ శరీరానికి ప్రతీకగా ఆమె అభిమానులు పిలుచుకుంటారు.
తన వయసులో సగం వయసు ఉన్న హాలీవుడ్ సెలబ్రిటీలతో హెలెన్ మిర్రన్ శరీరాన్ని పోల్చుకుంటే చాలా హుందాగా, ఉత్సాహాంగా ఉండడమే కాకుండా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. లాస్ ఏంజిల్స్ ఫిట్‌నెస్ సెంటర్ నిర్వహించిన పోల్‌లో హెలెన్ మిర్రన్ 17.65% ఓట్లను పోంది మొట్టమొదటి స్దానంలో నిలచారు. ఆమె తర్వాత ఎల్లీ మెక్ ఫెర్షన్ 10.6% శాతంతో రెండవ స్దానంలో ఉండగా, అందాల రాక్షసి కెల్లీ బ్రూక్ 8.35% శాతంతో మూడవ స్దానంలో నిలచారు. ఈ పోటీలో మొదటి పది స్దానాలు గెలుపోందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. హెలెన్ మిర్రన్ - 17.65%
2. ఎల్లీ మెక్‌పెర్సన్ - 10.6%
3. కెల్లీబ్రూక్ - 8.35%
4. జెన్నిఫర్ లోపెజ్ - 6.6%
5. శ్రేయల్ కోల్ - 5.35%
6. మైలినీ క్లాస్ - 4.2%
7. హొల్లీ - 4.1%
8. పిప్పా మిడిల్టన్ - 4%
9. కేట్ విన్స్‌లెట్ - 3.9%
10. నికోల్ - 3.8%
ఇక బాడీ ఆఫ్ ద ఇయర్ మేల్ కేటగిరికి వస్తే మొట్టమొదటి స్దానంలో ఆల్‌టైమ్ ఫేవరేట్ డేవిడ్ బెకహాం ఉండగా, రెండవ స్దానంలో జేమ్స్ బాండ్ హీరో డేనియల్ గ్రెగ్ ఉన్నారు.
1. డేవిడ్ బెకహాం - 21%
2. డేనియల్ గ్రెగ్ - 15.75%
3. జానీ డెప్ - 10.25%
4. బ్రాడ్ పిట్ - 9.35%
5. పీటర్ ఆండ్రీ - 6.65%
6. డేవిడ్ హాస్సల్లోఫ్ - 3.55%
7. రఫెల్ నాదల్ - 3.3%
8. రేయన్ రేనాల్డ్స్ - 3%
9. రోబ్బి విలయమ్స్ - 2.3%
10. సైమన్ కోవెల్ - 1.95%


Click it and Unblock the Notifications











