twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్య నుండి సంతాన చిట్కాలు నేర్చుకుంటున్నా..!

    By Nageswara Rao
    |

    లండన్, జులై 3: ఈ ఏడాది కొత్తగా తండ్రి అయిన హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ తన బ్రదర్ ల్యూక్ నుండి సంతాన చిట్కాలు తీసుకుంటున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయిన ల్యూక్ తాను తండ్రి అయిన కొత్తలో బేబిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తీసిన వీడియో ట్యూటోరియల్స్‌ను ఇప్పుడు తన తమ్ముడు క్రిస్‌కు పంపాడు.

    ఈ సందర్బంలో ల్యూక్ మాట్లాడుతూ నేను రూపొందించిన చిన్న వీడియోలో దుప్పటి కప్పివేయబడిన బేబిని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో క్షణ్ణంగా చూపించాను. కొన్ని సందర్బాలలో బేబిని ఎత్తుకునే విధానాలలో కూడా కొన్ని ప్రత్యేకతలను పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేకతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో పొందుపరచి తమ్ముడికి అందించానని చెప్పారు. క్రిస్ హెమ్స్‌వర్త్ భార్య ఎల్సా పాట్కే మే 11న ఇండియా రోస్ హెమ్స్‌వర్త్ అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

    క్రిస్ హెమ్స్‌వర్త్ ఆస్టేలియన్ హీరో. ఆస్టేలియన్ టివి సిరిస్‌ 'హోమ్ అండ్ ఎవే' లో పోషించిన కిమ్ హైడీ అనే పాత్ర ద్వారా తొలిసారి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2009లో 'స్టార్ ట్రెక్' సినిమాలో లెప్టెనెంట్ కమాండర్ జార్జి క్రిక్ పాత్ర ద్వారా పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నాడు. 2001వ సంవత్సరంలో విడుదలైన 'థార్' సినిమాలో మార్వెల్ కామిక్స్ పాత్ర ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపుని పొందారు.

    క్రిస్ హెమ్స్ వర్త్ నటించిన 'ది అవెంజర్స్' సినిమా 2012లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. వీటితో పాటు 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమాలో పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Chris Hemsworth, who became a father this year, is taking parenting tips from his brother Luke. A father of two children, Luke sent Chris video tutorials showing him how to take care of a baby.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X