Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అన్నయ్య నుండి సంతాన చిట్కాలు నేర్చుకుంటున్నా..!
లండన్, జులై 3: ఈ ఏడాది కొత్తగా తండ్రి అయిన హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ తన బ్రదర్ ల్యూక్ నుండి సంతాన చిట్కాలు తీసుకుంటున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయిన ల్యూక్ తాను తండ్రి అయిన కొత్తలో బేబిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తీసిన వీడియో ట్యూటోరియల్స్‌ను ఇప్పుడు తన తమ్ముడు క్రిస్‌కు పంపాడు.
ఈ సందర్బంలో ల్యూక్ మాట్లాడుతూ నేను రూపొందించిన చిన్న వీడియోలో దుప్పటి కప్పివేయబడిన బేబిని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో క్షణ్ణంగా చూపించాను. కొన్ని సందర్బాలలో బేబిని ఎత్తుకునే విధానాలలో కూడా కొన్ని ప్రత్యేకతలను పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేకతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో పొందుపరచి తమ్ముడికి అందించానని చెప్పారు. క్రిస్ హెమ్స్‌వర్త్ భార్య ఎల్సా పాట్కే మే 11న ఇండియా రోస్ హెమ్స్‌వర్త్ అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
క్రిస్ హెమ్స్‌వర్త్ ఆస్టేలియన్ హీరో. ఆస్టేలియన్ టివి సిరిస్ 'హోమ్ అండ్ ఎవే' లో పోషించిన కిమ్ హైడీ అనే పాత్ర ద్వారా తొలిసారి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2009లో 'స్టార్ ట్రెక్' సినిమాలో లెప్టెనెంట్ కమాండర్ జార్జి క్రిక్ పాత్ర ద్వారా పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నాడు. 2001వ సంవత్సరంలో విడుదలైన 'థార్' సినిమాలో మార్వెల్ కామిక్స్ పాత్ర ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపుని పొందారు.
క్రిస్ హెమ్స్ వర్త్ నటించిన 'ది అవెంజర్స్' సినిమా 2012లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. వీటితో పాటు 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమాలో పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.
తెలుగు వన్ఇండియా