Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సాహసాలతో...
హైదరాబాద్: జాకీచాన్ కథానాయకుడిగా తెరకెకక్కిన 'రష్ అవర్' సిరీస్ చిత్రాల దర్శకుడు బ్రెట్ రాట్నర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'హెర్కులెస్'. 'డబ్ల్యూడబ్ల్యూఈ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ చిత్రాల ద్వారా బక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన డ్వాన్ జాన్సన్ (రాక్) ఇందులో టైటిల్ పాత్ర పోషించాడు.
ఇటీవల హాలీవుడ్లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని 'సింహబలుడు' పేరుతో కె.ఎఫ్.సి ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఆగస్టు 1న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కె.ఎఫ్.సి ఎంటర్టెన్మెంట్స్ ప్రతినిధి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సాహసాలతో, వీరోచితమైన పోరాట సన్నివేశాలతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హెర్కులెస్ చిత్రాన్ని 'సింహబలుడు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నామని తెలిపారు.
ఆంధ్రప్రేదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. యాక్షన్ సినిమాలు మెచ్చే ఆడియన్స్‌కు ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని అన్నారు.