పెళ్లి కాకుండా తల్లైన చరణ్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు మరో నటుడితో!

ఇండియాలోనే ఎంతో మంది భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అదే సమయంలో విదేశాలకు చెందిన అమ్మాయిలు కూడా మన దగ్గర నటీమణులుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. కెరీర్ కంటే వ్యక్తిగత వ్యవహారాలతో తరచూ హైలైట్ అవుతోంది.

ముఖ్యంగా డేటింగ్ వార్తలతో సెన్సేషన్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ మరో వ్యక్తితో నిశ్చాతార్థం చేసుకుని షాకిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

ఇక్కడ ఫుల్ పాపులారిటీతో: హాలీవుడ్ నటిగా యమ పాపులర్ అయిన అమీ జాక్సన్.. 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాల్లోకి అడుగు పెట్టేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

పెళ్లి కాకుండానే తల్లైంది: ఇండియా వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో సందడి చేసిన హీరోయిన్ అమీ జాక్సన్.. ఆ సమయంలోనే మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేసింది. అప్పుడే ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఈ బ్యూటీ ఓ మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయింది.

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

తల్లయ్యాక బ్రేకప్ చెప్పేసి: జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తున్నప్పుడే తల్లైన అమీ జాక్సన్.. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు తన లవర్‌కు బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి సమయాన్ని గడుపుతోంది. అదే సమయంలో సినిమాల్లోకి సైతం రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇలా ఇప్పుడు అమీ జాక్సన్ తమిళ చిత్రంలో నటిస్తోంది.

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

కొంత కాలంగా అతడితోనే: జార్జ్‌ పనాయొటోతో బ్రేకప్ అయిన కొంత కాలానికే హీరోయిన్ అమీ జాక్సన్.. ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేయడం మొదలు పెట్టేసింది. అయితే, దీన్ని ప్రకటించకుండానే ఈ అమ్మడు అతడితో తరచూ కలిసి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియుడితో కలిసి ఫుల్ చిల్ అవుతోంది. ఇలా ఇద్దరూ నిత్యం రొమాన్స్‌ను పండిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

ప్రియుడితో చిల్ అవుతూ: చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తన అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మాత్రం అమీ జాక్సన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను వదులుతూ సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది.

Heroine Amy Jackson Gets Engaged with Ed Westwick

నిశ్చితార్థం చేసుకుందిగా: సుదీర్ఘ కాలంగా అనధికారికంగా ఎడ్ వెస్ట్‌విక్‌తో చేస్తున్న డేటింగ్ రిలేషన్‌షిప్‌కు తాజాగా అమీ జాక్సన్ సరైన క్లారిటీ ఇచ్చింది. సోమవారమే అతడితో ఈ అమ్మడు నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీ జాక్సన్ ప్రకటించింది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవడంతో పాటు వీళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X