పబ్లిక్‌లోనే చరణ్ హీరోయిన్ రొమాన్స్: నోట్లో నోరు పెట్టేసి మరీ పచ్చిగా!

సినిమా రంగంలోని నటీనటుల ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ఇలాంటివి ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. అలా డేటింగ్ వ్యవహారాలతో ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అవుతోన్న భామల్లో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. పెళ్లి కాకుండానే తల్లైన ఈ భామ.. ఇప్పుడు మరో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా అతడితో పబ్లిక్‌లోనే రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

ఇండియన్ సినిమాలతోనే
హాలీవుడ్ నటిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా భారత చలన చిత్రాల్లోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి ఎంటరైంది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది.

Heroine Amy Jackson Shares Cute Photo in Social Media

డేటింగ్ చేస్తూ తల్లైన అమీ
సౌతిండియాలో, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ఫామ్‌లో ఉన్నప్పుడే ఈ ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్.. మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలోనే ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత లవర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఈ బ్యూటీ ఓ మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

బిడ్డ పుట్టిన తర్వాత బ్రేకప్
జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో ఉన్నప్పుడే తల్లైన అమీ జాక్సన్.. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు తన లవర్‌కు బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి సమయాన్ని గడుపుతోంది. అయితే, కొంత కాలం తర్వాత ఈ భామ.. ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేయడం ప్రారంభించేసింది.

Heroine Amy Jackson Shares Cute Photo in Social Media

మరో నటుడితో లవ్ ట్రాక్
అమీ జాక్సన్ ఇప్పుడు ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తుందని ముందే చెప్పుకున్నాం. అతడితో తరచూ ఈ అమ్మడు రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియుడితో కలిసి రచ్చ ఫుల్ చిల్ అవుతోంది. ఇలా ఇద్దరూ నిత్యం రొమాన్స్‌ను పండిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు అమీ జాక్సన్ ఓ తమిళం చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.

Heroine Amy Jackson Shares Cute Photo in Social Media

సోషల్ మీడియాలో రచ్చ
ఇంగ్లీష్ నటిగా పరిచయమైన ఇండియాలోనూ ఫుల్ పాపులర్ అయిన అమీ జాక్సన్.. చాలా కాలంగానే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకెళ్తోంది. తద్వారా అమీ జాక్సన్ వాళ్లను ఖుషీ చేస్తోంది.

ప్రియుడితోనే ఎక్కువగా
మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తన అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే అమీ జాక్సన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను వదులుతూ సెన్సేషన్ అవుతోంది.

లవర్‌కు లిప్ కిస్ ఇచ్చి
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు తన ప్రియుడితో కలిసి పబ్లిక్‌లోనే రొమాంటిక్ ఫోజు ఇచ్చింది. అంతేకాదు, ఈ పిక్స్‌లో ఆమె అతడికి లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. మొత్తానికి అమీ జాక్సన్ షేర్ చేసిన ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X