రూ. 450 కోట్లు : రెమ్యూనరేషన్లో టాప్ హీరోలు వీరే!

అయితే తాజాగా మేము చెప్పబోయే ఓ హీరో సంపాదన వివరాలు చెబితే మీరు నోరు వెల్లబెట్టుకోక తప్పదు. అతనెవరో కాదు హాలీవుడ్ హీరో రాబర్ట్ బౌనీ జూనియర్. ఇటీవల వచ్చిన హాలీవుడ్ మూవీ 'ఐరన్ మ్యాన్ 3' హీరో. రాబర్ట్ బౌనీ 2012 జూన్ నుంచి 2013 జూన్ వరకు ఎంత సంపాదించాడో తెలుసా? ఏకంగా రూ. 450 కోట్లు($75 million)సంపాదించాడు.
రాబర్ట్ బౌనీ సంపాదన గురించిన వివరాలను తాజాగా ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరో కూడా ఇతగాడేనట. ఇంత మొత్తం కేవలం 'ది అవెంజర్స్', 'ఐరన్ మేన్ 3' అనే రెండు చిత్రాల ద్వారా మాత్రమే సంపాదించాడట రాబర్ట్ డౌనీ.
ఆయన తర్వాతి స్థానంలో సంవత్సారానికి రూ. 356కోట్ల($60 million) సంపాదనతో చానింగ్ టాటమ్ రెండో స్థానంలో ఉన్నారు. ఇతడు ఇటీవల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్, జి ఐ జోస్, వైట్ హౌస్ డౌన్ లాంటి చిత్రాల్లో నటించారు. రూ. 326 కోట్ల($55 million) సంపాదనతో ఎక్స్ మెన్, లెస్ మిసెరబుల్ చిత్రాల హరో హగ్ జాక్ మాన్ మూడో స్థానంలో ఉన్నారు.
టెడ్ మూవీ హీరో మార్క్ వాల్ బెర్గ్ రూ. 308($52 million) కోట్ల సంపాదనతో నాలుగో స్థానంలో, ఒకప్పటి డబ్ల్యుడబ్లుఎఫ్ ఫైటర్...ది రాక్ రూ. 273 కోట్ల($46 million) సంపాదనతో ఐదో స్థానంలో ఉన్నారు. ది రాక్ ఇటీవల విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జి ఐ జ్యోస్ లాంటి హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











