హాలీవుడ్ 'బ్లాక్ పాంథర్' హీరో హఠాన్మరణం.. సినీ లోకానికి మరో బిగ్గెస్ట్ షాక్
ఇటీవల కాలంలో సినీ ప్రపంచంలో పలు మరణాలు ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఒక వైపు కరోనా వైరస్ మరోవైపు సినీ తారల మరణాలు 2020లో కోలుకోలేని విషాదాలను మిగులిస్తున్నాయి. మొన్న బాలీవుడ్ లో జరిగిన మరణాలను మరవకముందే ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరో చాడ్విక్ బోస్మాన్ హఠాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని మరింత షాక్ కి గురి చేస్తోంది.
Recommended Video

"బ్లాక్ పాంథర్" సినిమాతో భారీ క్రేజ్..
"బ్లాక్ పాంథర్" సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు టెక్బుకున్న స్టార్ చాడ్విక్ బోస్మాన్ క్యాన్సర్ తో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. గత కొంత కాలంగా ఈ నటుడు పెద్దప్రేగు క్యాన్సర్ తో ఒక యుద్ధమే చేస్తున్నాడు. నాలుగేళ్లుగా అతను ప్రపంచ ప్రసిద్ధ ఆస్పత్రిలలో ఎన్నో రకాల చికిత్సను అందుకున్నాడు.

శుక్రవారం పరిస్థితి విషమించడంతో
ఇక శుక్రవారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు దాదాపు ఆశలు వధులుకోవాల్సి వచ్చింది. అతని ప్రతినిధి ఒకరు చాడ్విక్ మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం చాడ్విక్ వయసు 43 సంవత్సరాలు. నాలుగేళ్లకు ముందే క్యాన్సర్ భారీన పడినట్లు తెలుసుకున్న చాడ్విక్ ట్రీట్మెంట్ కోసం చాలానే కష్టపడ్డాడు.

సంచలనం సృష్టించాడు..
మార్వెల్ స్టూడియోస్ లో సూపర్ హీరోగా నటించడానికి ముందు, బోస్మాన్ కెరీర్ మొదట బ్లాక్ అమెరికన్ ఐకాన్స్ జాకీ రాబిన్సన్, జేమ్స్ బ్రౌన్ చిత్రాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక బ్లాక్ పాంథర్ లో అతను చేసిన కింగ్ పాత్ర ఒక సంచలనం సృష్టించింది.

క్యాన్సర్ తోనే షూటింగ్స్..
ప్రపంచంలో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల్లో బ్లాక్ పాంథర్ కూడా నిలిచింది. ఇక చాడ్విక్ మరణించినట్లు అతని అధికారిక ట్విట్టర్ ద్వారానే జనాలకు తెలిసేలా చేశారు. అతను క్యాన్సర్ భారిన పడినప్పటికి కూడా పలు షూటింగ్స్ లలో పాల్గొన్నాడు. ఇక రీసెంట్ గా పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపారు.


Click it and Unblock the Notifications











