కౌగిలిలో బంధించి లైంగిక దాడి.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు.. పీకల్లోతు కష్టాల్లో స్పైడర్ మ్యాన్ యాక్టర్
ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటుడు జామీ ఫాక్స్ అలియాస్ ఎరిక్ మార్లన్ బిషప్ లైంగిక దాడి కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. 2015 సంవత్సరంలో నమోదైన కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు విచారణ న్యూయార్క్ కోర్టు చేపట్టడంతో ఆయన చట్టపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు అని హాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్ నగరంలో 8 ఏళ్ల క్రితం ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని ఓ మహిళపై జామీ ఫాక్స్ లైంగిక దాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయింది. జామీ ఫాక్స్ తనను బలాత్కారం చేశాడు. న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లోని రూఫ్ టాప్ ప్రాంతంలో తనను బలవంతంగా దగ్గరకు లాక్కొని వక్షోజాలను తడిమాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్యాంట్ లాగేసి అనుచితంగా ప్రవర్తించాడు అని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

2015లో ఆగస్టు 27వ తేదీన నేను, నా ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి ఓ మూలన కూర్చున్నాం. ఆ పక్కనే యాక్టర్ కనిపించగానే నా ఫ్రెండ్ అతడి వద్దకు వెళ్లి ఫోటో అడిగింది. దాంతో మీ కోసం ఏదైనా చేస్తాను డియర్ అంటూ మా టేబుల్ వద్దకు వచ్చి కొన్ని ఫోటోలకు ఫోజిచ్చాడు. ఆ తర్వాత నన్ను అదోలా చూస్తూ.. బేబీ నీకు సూపర్ మోడల్ బాడీ ఉంది. నీ శరీరం నుంచి మంచి సువాసనలు వస్తున్నాయి అంటూ దగ్గరకు వచ్చాడు అని తన ఫిర్యాదులో పేర్కొన్నది.
రెస్టారెంట్‌లో ఫోటోలు దిగుతున్న సమయంలో జామీ ఫాక్స్ నన్ను లాగేసుకొన్నాడు. నా వక్షోజాలను తడుముతూ, నా నడుము కింది భాగంలోని డ్రస్స్‌ను, ప్యాంట్‌ను తొలగించి అతిగా ప్రవర్తించాడు. నా మర్మాంగంపై చేతులు పెట్టి దారుణంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు అక్కడే ఉన్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జామీ ఫాక్స్ ప్రవర్తించిన తీరు తర్వాత నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఆ సంఘటన నుంచి త్వరగా తేరుకోలేకపోయాను. నా ఆరోగ్యం దెబ్బ తిన్నది. శారీరకంగా, మానసికంగా నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను అని బాధితురాలు ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.
జామీ ఫాక్స్ విషయానికి వస్తే.. రే ఛార్లెస్ జీవితం ఆధారంగా రూపొందిన రే బయోపిక్‌లో నటించాడు. ఈ సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యారు. తన కెరీర్‌లో కొల్లేటెరల్, డ్రీమ్ గర్ల్స్, ది కింగ్‌డమ్, డాంగో అన్‌చైన్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











