twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ఇండస్ట్రీలో విషాదం.. దిగ్గజ నటుడు కిర్క్ డగ్లస్ కన్నుమూత

    |

    హాలీవుడ్ దిగ్గజ నటుడు కిర్క్‌ డగ్లస్‌ (103) బుధవారం రోజు కన్నుమూశారు. 103 సంవత్సరాల వయస్సులో మమ్మల్ని విడిచి పెట్టడం తట్టుకోలేకపోతున్నామని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. హాలీవుడ్‌ 'గోల్డెన్‌ ఏజ్‌' అని వ్యవహరించే కాలానికి చెందిన వారిలో ఇంతకాలం బ్రతికిన ఏకైక నటుడిగా కిర్క్‌ డగ్లస్‌.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

    ఓ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఒక నటుడుగా, అంతకుమించిన మానవతావాదిగా నిండైన జీవితాన్ని గడిపిన ఆయన.. ఇన్నేళ్ల పాటు ఎలాంటి విబేధాలకు పోకుండా జీవించారు. ఆయన మృతి వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కిర్క్‌ డగ్లస్‌.. అంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు హాలీవుడ్ పెద్దలు.

     Hollywood Actor Kirk Douglas Passed Away

    1916లో అమ్‌స్టర్‌డామ్‌లోని డానిలోవిచ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. దుర్భర పేదరికం నేపథ్యంలోనే నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. 'ద స్ట్రేంజ్‌ లవ్‌ ఆఫ్‌ మార్తా ఇవర్స్‌' (1946) సినిమాతో వెండితెరకు పరిచయమై, 'ఛాంపియన్‌', 'యంగ్‌మ్యాన్‌ విత్‌ ఏ హార్న్‌', 'ఏస్‌ ఇన్‌ ద హోల్‌', 'డిటెక్టివ్‌ స్టోరీ', 'ద బ్యాడ్‌ అండ్‌ ద బ్యూటిఫుల్‌', 'లస్ట్‌ ఆఫ్‌ ఫైర్‌', 'పాథ్స్‌ ఆఫ్‌ గ్లోరీ', 'స్పార్టకస్‌', 'లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌', 'సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే' లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు కిర్క్‌ డగ్లస్‌.

    English summary
    Hollywood actor Kirk Douglas(103) paased away. He is one of the great Hollywood leading men whose off-screen life was nearly as colorful as his on-screen exploits in movies like "Spartacus" and "Champion," has died, according to his son, actor Michael Douglas. He was 103.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X