డ్రగ్స్ మోతాదు ఎక్కువ అవడం వల్లే శవమయ్యాడు: పోలీసులు
లాస్ ఏంజిల్స్, జులై 14: హాలీవుడ్ ఒకప్పటి సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ ముద్దుల కుమారుడు 36 ఏళ్లు కలిగిన సేజ్ లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో శవమై కనిపించాడు. సిల్వెస్టర్ స్టాలన్ మొదటి భార్య సాష జాక్ కుమారుడే ఈ సేజ్. తన కుమారుడు సేజ్ చనిపోయిన మరణ వార్త వినగానే చెట్టు లాంటి సిల్వెస్టర్ స్టాలన్ కుప్పకూలిపోయాడు.
సిల్వెస్టర్ స్టాలన్ తన కుమారుడు సేజ్ చనిపోయిన మరణ వార్త ఆకస్మికంగా వినగానే శోకసముద్రమైనట్లు స్టాలన్ అధికార ప్రతినిధి ద్వారా తెలిసింది. అతని ప్రేమ మరియు ఆలోచనలు సేజ్ యొక్క తల్లి సాషాతో ఉన్నాయని చెప్పాడు. సేజ్ చాలా తెలివైన యువకుర్రాడని అన్నారు. సేజ్‌ని కోల్పోవడంతో సిల్వెస్టర్ స్టాలన్ నిశ్చేష్టుడయ్యాడని అన్నారు. శుక్రవారం సేజ్ చనిపోయాడని గుర్తించిన పోలీసు అధికారులు సిల్వెస్టర్ స్టాలన్‌ని మధ్యాన్నం 2.17 నిమిషాల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్ ఇంటికి శవమై ఉన్న తన కొడుకు మృతదేహన్ని చూసేందుకు కబురు పంపారు.
ఇది ఒక భయంకరమైన విషాదమని, అతను చాలా చిన్నతనంలోనే చనిపోవడం బాధాకరమని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ కామండర్ ఆండ్రూ స్మిత్ తన సానుభూతిని తెలియజేశారు. పోలీసులకు అందించిన రిపోర్ట్స్ ప్రకారం సేజ్ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లనే చనిపోయాడని ఆండ్రూ తెలిపారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చిందని పోలీసు నిపుణులు రిపోర్ట్స్ ఆధారంగా చెప్పారు.
తన తండ్రి సిల్వెస్టర్ స్టాలన్‌కు హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన రాకీ V, సినిమాలో రాకీ కుమారుడు రాబర్ట్ బాల్బోగా సేజ్ నటించాడు. ఈ సినిమా 1990లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. ఇటీవలే రాక్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ కాలిఫోర్నియా ఎడారిలో ఉన్న తన చారిత్రక విల్లాని $ 4.5 మిలియన్ల్ అమ్మకానికి పెట్టాడు. ఇలా సిల్వెస్టర్ స్టాలన్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











