For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాలీవుడ్ యాక్టర్ కాల్చివేత.. బుల్లెట్ గాయాలతో మృతి

  |

  స్పైక్ లీ చిత్రాలలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సీనియర్ హాలీవుడ్ నటుడు థామస్ జెఫెర్సన్ బైర్డ్ తుపాకీ కాల్పుల కారణంగా మరణించాడు. శనివారం ఉదయం జార్జియాలో థామస్‌ను దారుణంగా కాల్చి చంపినట్లు అట్లాంటా పోలీసు ప్రతినిధి ఆంథోనీ గ్రాంట్ సిఎన్‌ఎన్‌కు ధృవీకరించారు. ఒక్కసారిగా సినిమా ప్రపంచాన్ని ఈ ఘటన షాక్ కి గురి చేసింది. ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని చెందించేందుకు పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.

  వెనుక భాగంలో తుపాకి కాల్పులు

  వెనుక భాగంలో తుపాకి కాల్పులు

  గాయపడిన ఒక వ్యక్తి కోన ఊపిరితో ఉన్నాడని నైరుతి అట్లాంటా నుండి పోలీసులకు శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు ఒక కాల్ వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత థామస్ (70) అప్పటికే ప్రాణాలు విడిచారు. ఇక ఆయన ఏ విధంగాను స్పందించడం లేదని వారు తెలిపారు. థామస్ వెనుక భాగంలో తుపాకీతో కాల్చినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ సీనియర్ నటుడు డెత్ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

  గొడవ కారణంగానే మరణించాడా?

  గొడవ కారణంగానే మరణించాడా?

  అందరితో స్నేహపూర్వకంగా ఉండే థామస్ ని చంపాల్సిన అవసరం ఏమి వచ్చిందనే విషయం దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ బైర్డ్స్ స్నేహితుడు అలాగే మాజీ ప్రతినిధి క్రెయిగ్ వైకాఫ్ స్నేహితుల సర్కిల్ లో ఉండేవాడని చెబుతున్నారు. ఇక శనివారం మిస్టర్ బైర్డ్ ఒక దుకాణంలో ఎవరితోనో గొడవకు దిగాడని పోలీసులు ఒక సాక్షి ద్వారా తెలుసుకున్నట్ల తెలుస్తోంది.

  ఆ సినిమాలతో మంచి గుర్తింపు

  ఆ సినిమాలతో మంచి గుర్తింపు

  ఇక థామస్ అట్లాంటాలోనే తన జీవితాన్ని ఎక్కువగా గడిపాడు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న గ్రిఫిన్‌లో జన్మించిన ఈ సీనియర్ నటుడు మోరిస్ బ్రౌన్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. స్టేజ్ ఆర్టిస్ట్ గా బ్రడ్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ నుండి మాస్టర్ డిగ్రీ పొందాడు. స్పైక్ లీ యొక్క 'హి గాట్ గేమ్,' 'గెట్ ఆన్ ది బస్' 'క్లాకర్స్' వంటి సినిమాలతో థామస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు.

  #Darbar : Rajinikanth's Darbar Box Office Collections Day 1
  సంతాపం తెలిపిన హాలీవుడ్ ప్రముఖులు

  సంతాపం తెలిపిన హాలీవుడ్ ప్రముఖులు

  ఇక హాలీవుడ్ అగ్రతరలు అభిమానులు థామస్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. స్పైక్ లీ స్పందిస్తూ.. "జార్జియాలోని అట్లాంటాలో చివరి రాత్రి మా ప్రియమైన సోదరుడు థామస్ జెఫెర్సన్ బైర్డ్ యొక్క విషాద హత్యకు గురి కావడం నన్ను కలచి వేసింది. టామ్ ఈజ్ మై గై. అతను చేసిన పాత్రలు అలాగే అతని మంచి గుణం ఎప్పటికి మరచిపోలేనిది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోతుకంటున్నాను.. అని ఈ వివరణ ఇచ్చారు.

  English summary
  Thomas Jefferson Byrd, a senior Hollywood actor who received a special craze for himself as an actor in Spike Lee films, has died due to gunshot wounds. Atlanta police spokesman Anthony Grant confirmed to CNN that Thomas was brutally shot in Georgia on Saturday morning. The incident shocked the film world at once. Police are investigating all angles to unravel the mystery behind this murder.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X