Anne Heche: కారు ప్రమాదంలో హాలీవుడ్ నటి మృతి.. వారం రోజులు ప్రాణాలతో పోరాడుతూ..
హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది 90 ల కాలంలో వరుస సినిమాలతో ఒక స్టార్ హోదాను చూసిన ప్రముఖ నటి అన్నా హెచే(53) కన్నుమూశాలు. యాక్షన్ కామెడీ చిత్రం సిక్స్ డేస్ సెవెన్ నైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపునందుకున్న ఆమె పఠాత్తుగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొన్నటి వరకు పలు సినిమాలతో చాలా చలాకీగా కనిపించిన అన్నా హఠాత్తుగా అలా మరణించడం నమ్మలేకపోతున్నాము అని కూడా సినీ ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు.
క్రైమ్ డ్రామా ఫిల్మ్ డోనీ బ్రాస్కో (1997), వోల్కనో (1997),
ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ (1997) సినిమాలతో 1990ల చివరలో ఆమె ఎక్కువ క్రేజ్ అందుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఇక ఆమె ఇటీవల ఆగస్టు 5వ తేదీన ఒక ప్రమాదానికి గురయ్యారు. ఒక కార్యక్రమాలలో ఊహించిన విధంగా అన్నా గాయపడ్డారు. లాస్ ఏంజిల్స్‌లోని మార్ విస్టా పరిసరాల్లో రెండు కార్లు బలంగా ఢీ కొట్టుకోవడం వలన మరొక కారులో ఉన్న ఆమె ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.

అలాగే ఈ ప్రమాదం కూడా అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. మొదట ఆమె ఒక కారును ఢీకొన్న తర్వాత అదుపుతప్పి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని గ్యారేజీని ఢీకొట్టింది. ఆ తరువాత ఆమె కారు ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగడంతో తీవ్రంగా కాలిపోయింది. ఇక సిసి ఫుటేజ్ లో దొరికిన వీడియోలను బట్టి ఆమె కారు వేగంగా నడిపినట్లు తెలుస్తోంది. అయితే కారు మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆ మంటలను ఆర్పడానికి దాదాపు గంట ఒక పైగా సమయం పట్టింది.
చాలామంది ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఇక హాస్పిటల్ తీసుకువెళ్లాగా అక్కడ ఆమె వారం రోజులు పాటు చికిత్స తీసుకున్నారు. ఇక బ్రెయిన్ డేడ్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వారం రోజులు ప్రాణాలతో పోరాడిన ఈ ప్రముఖ నటి కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా సినీ ప్రముఖుల అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











