కరోనా దెబ్బకి కుప్పకూలిన సీనియర్ నటి.. విషాదంలో సినిమా లోకం!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి తన బలాన్ని పెంచుకుంటోంది. కోవిడ్ 19ని అంతమొందించాలని వరల్డ్ వైడ్ గా ఎంతో మంది వైద్య నిపుణులు నిద్ర హారాలు మాని పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పట్లో కరోనా వైరస్ కి వ్యాక్సిన్ దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఏడాది సమయం పట్టవచ్చని వైద్య నిపుణులు తెలియజేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది.

20లక్షలకు చేరువలో...

20లక్షలకు చేరువలో...

పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా అన్ని వర్గాల వారిని బలి తీలుకుంటోంది. ఇప్పటికే మరణాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షను దాటింది. ఇక నమోదైన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 18లక్షలకు దగ్గర్లో ఉండగా.. మరికొన్ని రోజుల్లో ఆ సంఖ్య 20లక్షలకి చేరే అవకాశం ఉంది. దీన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి.

 కరోనా దెబ్బకు మరో నటి బలి..

కరోనా దెబ్బకు మరో నటి బలి..

ఇప్పటికే విదేశాల్లో కొంత మంది సినీ యాక్టర్స్ కరోనా భారిన పడి మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ నటి కూడా కన్నుమూసింది. ఆమె పేరు హిల్లరీ హిత్. 74 ఏళ్ల వయసు కలిగిన హిల్లరీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కరోనా ఉన్నట్లు చివరి క్షణాల్లో కనుగొన్నారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు శ్రమించినప్పటికి ఆమె ఆరోగ్యం అప్పటికే విషమించింది.

షాకైన హాలీవుడ్..

షాకైన హాలీవుడ్..

ఇంగ్లాండ్ కి చెందిన హిల్లరీ హిత్ 1968లో హాలీవుడ్ లో అడుగుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'విచ్ ఫైండర్ జనరల్' అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైన ఆమె నటిగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకున్నారు. ఇక ఆమె మరణం గురించి తెలుసుకున్న హాలీవుడ్ నటులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.

Recommended Video

Arjun Kapoor & Malaika Arora Relation Gearing Up Heat In Bollywood || Filmibeat Telugu
క్లారిటీ ఇచ్చిన కుమారుడు..

క్లారిటీ ఇచ్చిన కుమారుడు..

హిల్లరీ హిత్ కి కోవిడ్ 19 పాజిటివ్ అని వార్తలు రాగానే చాలా మంది నమ్మలేదు. ఇక మరణించింది అని తెలిసినా కూడా ఆమె చనిపోలేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా హిల్లరీ కుమారుడు అలెక్స్ విలియమ్స్ స్పందించక తప్పలేదు. తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా తల్లి మరణవార్త గురించి తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X